Site icon NTV Telugu

Ananya Panday: పాపం అనన్య పాండే.. అమ్మడిని ఆదుకునేది అతడేనా?

Ananya Panday Career

Ananya Panday Career

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కెరీర్ చాలా డల్‌గా సాగుతోంది. హిట్ చూసి మూడేళ్లు దాటుతోంది. ‘డ్రీమ్ గర్ల్ 2’ తర్వాత సక్సెస్ ఎలా ఉంటుందో ఆమెకు తెలియదు. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య.. ‘పతి పత్ని ఔర్ ఓ’తో సెకండ్ హిట్ చూసింది. అయితే అమ్మడి హ్యాట్రిక్ హిట్టుకు విజయ్ దేవకొండ ‘లైగర్’ బ్రేకులేసింది. టాలీవుడ్ ఎంట్రీలో బిట్టర్ రిజల్ట్ చూసింది. ఇక చేసేదేం లేక బాలీవుడ్ చెక్కేసింది అనన్య.

అనన్య పాండే నటించిన సినిమాలు థియేటరల్లో కన్నా.. ఓటీటీలో ఎక్కువ ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఆమెకు పెద్దగా పేరు, క్రెడిట్ దక్కలేదు. ఇక డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వదిలి.. థియేటర్‌పై ప్రత్యక్షమౌతున్నా ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం లేదు. 2025లో ‘కేసరి చాప్టర్ 2’లో డీ గ్లామర్ రోల్ చేసినా.. ‘తుమేరీ మేతేరా’లో గ్లామర్ డోస్ పెంచినా సక్సెస్ మాత్రం దరిచేరలేదు. బీటౌన్‌లో ఫేడవుట్ దశకు చేరుకుంటోంది అనుకుంటోన్న టైంలో మళ్లీ ఆమెను ధర్మ ప్రొడక్షన్సే ఆదుకుంటోంది.

Also Read: Peddi Pehelwan Glimpse: ‘పెద్ది’ గ్లింప్స్ విడుదల.. ‘ఆటే నా పొగరు’ డైలాగ్‌కు ఫ్యాన్స్ ఫిదా, గూస్ బంప్స్ తెప్పిస్తున్న చరణ్‌ విన్యాసాలు!

స్టార్ కిడ్స్‌తో సినిమాలు నిర్మించే కరణ్ జోహార్.. జాన్వీని పోషిస్తున్నట్లే, అనన్యకు మద్దతుగా నిలుస్తున్నాడు. గత ఏడాది ఇదే ప్రొడక్షన్ హౌస్‌లో వచ్చిన టూ ఫిల్మ్స్ బెడిసికొట్టినా.. మరో టూ ఆఫర్స్ ఇస్తున్నాడు ఈ ప్రొడ్యూసర్. లక్ష్య హీరోగా తెరకెక్కుతోన్న చాంద్ మేరా దిల్, కాల్ మీ బే 2 సిరీస్ నిర్మిస్తోంది ధర్మ. చాంద్ మేరా దిల్ ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉండగా.. మే 22కి వాయిదా వేసుకుంది. ఇక కాల్ మీ బే2 త్వరలో ఓటీటీలోకి రాబోతోంది. మరి ఈ ఏడాదైనా అనన్య సక్సెస్ బాట పడుతుందా?, ధర్మ ప్రొడక్షన్ హౌస్ ఆమెకు హిట్టిస్తుందా? అనేది చూడాలి.

Exit mobile version