NTV Telugu Site icon

Ananya Panday : లైగర్ బ్యూటీ ఓటీటీ డెబ్యూ.. వెబ్ సిరీస్ లో నటిస్తున్న అనన్య

Untitled Design (17)

Untitled Design (17)

అనన్యపాండే. ‘లైగర్‌’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది. త్వరలో ఆమె నటించిన మొదటి వెబ్‌సిరీస్‌ ‘కాల్‌ మీ బె’, ‘కంట్రోల్‌’ సినిమాతో ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూ లు ఇస్తోంది అనన్య. అందులో భాగంగా ఈ యంగ్ బ్యూటీ మాట్లాడుతూ ‘‘ దర్శకుడు విక్రమాదిత్య లాంటి అద్భుతమైన దర్శకుడితో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా. ఈ సినిమా షూటింగ్ లో ఆయన నాకు నేర్పించిన విలువల్ని జీవితాంతం గుర్తుంచుకుంటాను. ‘కంట్రోల్‌’ చిత్రం కోసం చాలా కష్టపడ్డాను కానీ ఈ సినిమా షూటింగ్‌ను కేవలం 13రోజుల్లోనే పూర్తి చేశాను’’. ‘‘నలుగురు పురుషుల సరసన బెల్లా చౌదరి ఈ పాత్ర నా జీవితానికి దగ్గరగా అనిపించింది. ఎంతటి కష్టం వచ్చిన చిరునవ్వుతో ముందుకు నా వ్యక్తిత్వానికి బెల్లా చౌదరి పాత్ర దగ్గరగా ఉంటుంది.

Also Read: Devara : దేవర ‘రన్ టైమ్’ అన్ని గంటలంటే కాస్త కష్టమే సుమీ..

ఇక  అనన్య నటిస్తున్న మొదటి వెబ్ సిరీస్ ‘కాల్‌ మీ బె.’ దీనికి సంబందించి పలు విషయాలను పంచుకుంది. కొలిన్‌ డి కున్హా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ రొమాంటిక్, కామెడీ, డ్రామా కథాంశంతో రూపొందింది. ఎనిమిది భాగాలుగా తెరకెక్కిన ఈ సిరీస్‌ చాలా సరదాగా ఆడియన్స్ కు నచ్చేలా ఉంటుంది. ఈ సిరీస్ నాకు చాలా ప్రత్యేకం, చిత్రపరిశ్రమలో నన్ను నేను నిరూపించుకోవాలని ఎదురుచూస్తున్న సమయంలో ఈ అవకాశం వచ్చింది. ఆరేళ్లు నా సినీ కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించాను కానీ నాకు 2007లో వచ్చిన ‘భూల్‌ భులయ్యా’ ఆల్‌ టైమ్‌ ఫేవరెట్‌. ఇప్పటికీ ఆ సినిమా చుస్తే భయమేస్తుంది. ఇలాంటి హార్‌ర్‌-కామెడీ జానర్‌లో నటించాలనేది నా కోరిక. అలాగే గెస్ట్ రోల్స్ లో నటించడం తనకు చాలా ఇస్తామని తెలిపింది ఈ హాట్ బ్యూటీ.

Show comments