Site icon NTV Telugu

Ananya Nagalla: కాస్టింగ్ కౌచ్ పై అనన్య షాకింగ్ కామెంట్స్

Casting Couch

Casting Couch

Ananya Nagalla Shocking Comments on Casting Couch: వకీల్ సాబ్, మల్లేశం లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల. చివరిగా ‘తంత్ర’ అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ఈసారి పొట్టేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కాస్టింగ్‌ కౌచ్‌పై ఎదురైన ప్రశ్నకు నటి అనన్య నాగళ్ల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడతారు? ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వాలంటే కమిట్‌మెంట్‌ అడుగుతారని టాక్ ఉంది కదా మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా? అని అనన్యను ఒక రిపోర్టర్ ప్రశ్నించింది. వేరే రంగాల్లో కూడా ఉంటుంది కానీ సినిమా వాళ్లనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అని అడిగితే ‘‘సినిమా ఛాన్స్‌ ఇచ్చే ముందు హీరోయిన్స్‌ను కమిట్‌మెంట్‌ అడుగుతుంటారు.
వేరే రంగాల్లో అలా ఉండదు కదా అని రిపోర్టర్ చెప్పుకొచ్చారు.

Harsha Sai : హర్ష సాయి కేసులో ఆర్జే శేఖర్ భాషా అరెస్టు?

మీరు తెలుసుకోకుండా వందశాతం ఉంటుందని ఎలా అడుగుతున్నారు? అని అంటే అదేమీ లేదని ఆమె అన్నారు. అయితే మీరు చేసే అగ్రిమెంట్ లో కూడా ఉంటుందట కదా, మా ఫ్రెండ్సే చెప్పారు అని అంటే ఈ వందశాతం తప్పు అని అన్నారు. అవకాశం రావడం కంటే ముందే కమిట్‌మెంట్‌ అనేది టాలీవుడ్‌లో లేదు. ఎక్కడైనా పాజిటివ్, నెగెటివ్‌ అనేది సమానంగా ఉంటాయి. మీరు ఎక్స్ పీరియన్స్ చేయకుండా ఎలా అడుగుతున్నారు? నటిగా నేను చెబుతున్నా క్యాస్టింగ్ కౌచ్‌ పరిస్థితులైతే ఇండస్ట్రీలో లేవు’ అని అన్నారు.‘‘కమిట్‌మెంట్‌ను బట్టే పారితోషికం ఉంటుందని ఇండస్ట్రీలో వినిపిస్తుంటుంది’’ అని సదరు విలేకరి మరో ప్రశ్న సంధించగా.. ‘మీరు విన్న మాటలు చెబుతున్నారు. కానీ, నేను ఆ ఫీల్డ్‌లోనే ఉన్నా. మీరు అనుకున్నది ఇక్కడ లేదు’’ అని ఆమె బదులిచ్చారు.

Exit mobile version