Site icon NTV Telugu

Ananya Nagalla : షూటింగ్‌లో నవ్వులు.. కారవాన్లో కన్నీళ్లు – అనన్య బ్రేకప్ స్టోరీ !

Ananya Nagalla

Ananya Nagalla

తెలుగు చిత్రసీమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల. చిన్న చిత్రాలతో సినీ ప్రయాణం ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 2018లో విడుదలైన ‘మల్లేశం’ మూవీతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ‘వకీల్‌సాబ్’లో తన పాత్రతో మంచి గుర్తింపు లభించగా. తర్వాత ‘శాకుంతలం’, ‘తంత్ర’,‘పొట్టేల్’ వంటి విభిన్న కథాచిత్రాల్లో నటించి తన టాలెంట్‌తో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. ఇక యాక్టింగ్ తో పాటు, వ్యక్తిత్వం విషయంలోనూ ఎంతో బలంగా నిలిచిన అనన్య.. ఇటీవల తన జీవితానికి సంబంధించిన ఒక విషాద ఘట్టాన్ని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.

Also Read : Kubera : ఓటీటీ, శాటిలైట్ పార్ట్‌నర్స్‌ను లాక్ చేసుకున్న ‘కుబేర’..

‘చాలా మంది జీవితాలు వెలుగులో ఉంటాయి. కానీ, వారి బాధలు వెనుక దాగుంటాయి. ఇండస్ట్రీకి వచ్చాక కొంతకాలానికే నా బ్రేకప్ జరిగింది. అది నా మనసుకు  తాకిన పెద్ద షాక్‌. రెండు సంవత్సరాలు ఆ బాధ నుంచి బయట పడలేక పోయా. రాత్రిపూట ఎమోషన్‌తో ఏడ్చేసి, ఉదయం జిమ్‌కి వెళ్ళేదాని. కారవాన్లో ఏడ్చిన కూడా, తర్వాత షూటింగ్‌కు వచ్చేసే సమయానికి బాధ కనిపించకుండా చూసుకునేదాని. కుటుంబానికి ఏ మాత్రం తెలియనివ్వలేదు. ఎలాంటి పరిస్థితినైనా గట్టిగా ఎదుర్కొనగల శక్తి నాకు ఉంది. బ్రేకప్ బాధ నా కెరీర్‌పై ప్రభావం చూపకుండా చూసుకున్నాను. ప్రెఫెషనల్‌ లైఫ్‌లో ఎమోషన్స్‌కు స్థానం ఇవ్వకూడదని అప్పుడే నిర్ణయింయుకున్న. నటిగా నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన వాళ్లను నిరాశపరచకూడదు. అందుకే ఆ బాధను బయట చూపించలేదు’ అని అనన్య తెలిపింది. ఆమె చెప్పిన ఈ మాటలు ఎంతో మందికి ప్రేరణ గా నిలుస్తున్నాయి.

Exit mobile version