Site icon NTV Telugu

Ananya Nagalla: మెట్రోపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్.. మేం చేస్తే తప్పేంటి?

Ananya Nagalla

Ananya Nagalla

తెలుగు సినీ నటి అనన్య నాగళ్ళ సోషల్ మీడియా ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వివాదం తాజాగా టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అనన్య తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ” ప్రభుత్వ ఆస్తి అయిన మెట్రోపై బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తే, దాన్ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అని మాకు ఎలా తెలుస్తుంది ? ” అని ప్రశ్నించడం హాట్ టాపిక్ అయింది. తెలంగాణలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, సెలెబ్రిటీలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనన్య నాగళ్ళపై కూడా కేసు నమోదైంది. పంజాగుట్ట పోలీసులు ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Ram Charan : సంక్రాంతికి వస్తున్న రామ్ చరణ్‌..?

ఇటీవల యూట్యూబర్లు హర్ష సాయి, బయ్యా సన్నీ యాదవ్‌లపై కూడా ఇలాంటి కేసులు నమోదు కాగా, ఇప్పుడు సినీ తారలపైనా దృష్టి సారించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అనన్య తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా కొన్ని బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించిన ప్రచార కంటెంట్‌ను పోస్ట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ యాప్స్ యువతను తప్పుదారి పట్టించే అవకాశం ఉందని, చట్ట విరుద్ధ కార్యకలాపాలకు దారితీస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో టాలీవుడ్ సెలెబ్రిటీలు చిక్కుకుంటున్నారు. భారతదేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు సంబంధించి కఠిన నిబంధనలు ఉన్నాయి. తెలంగాణ గేమింగ్ చట్టం ప్రకారం, ఇలాంటి యాప్స్‌ను ప్రమోట్ చేయడం చట్టవిరుద్ధం. దీనికి గాను జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. అనన్యపై నమోదైన కేసు దర్యాప్తు దశలో ఉంది కాబట్టి, ఆమెకు ఎలాంటి శిక్ష పడుతుందనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

Exit mobile version