NTV Telugu Site icon

దీపికా, కరీనా, హృతిక్, షాహిద్… అందరి చేతా రిజెక్ట్ చేయబడ్డ ‘సక్సెస్ ఫుల్ డైరెక్టర్’!

Anand L Rai rejected by these bollywood top stars

‘తను వెడ్స్ మను’, ‘రాంఝణా’ లాంటి చిత్రాలతో సత్తా చాటిన సెన్సిటివ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్. రాయ్. అయితే, ఆయన గత చిత్రం ‘జీరో’. షారుఖ్ లాంటి బడా స్టార్ ని మరుగుజ్జుగా చూపించి జనాలకి షాక్ ఇచ్చాడు. సినిమా ‘జీరో’ అన్న పేరుకు తగ్గట్టుగా నెగటివ్ రివ్యూలతో నీరుగారిపోయింది. కాకపోతే, జూన్ 28న బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటోన్న బీ-టౌన్ టాలెంటెడ్ డైరెక్టర్ తనదైన ముద్ర మాత్రం ఇప్పటికే వేయగలిగాడు. హిట్స్ అండ్ ఫ్లాప్స్ పక్కన పెడితే ఏదో ఒక కొత్తదనం తన సినిమాలో చూపిస్తాడని ఆనంద్ కు పేరు. అయినా, కూడా కొందరు బాలీవుడ్ ఏ-లిస్టర్స్ ఆయన ఆఫర్స్ ని రిజెక్ట్ చేశారు. వాళ్లు ఎవరో, ఎందుకు ఆనంద్ ఎల్. రాయ్ కి సారీ చెప్పి తప్పుకున్నారో… లెట్స్ చెక్…

‘తను వెడ్స్ మను’ సినిమాలో నటించిన కంగనా రనౌత్ జాతీయ అవార్డ్ స్వంతం చేసుకుంది. కానీ, అసలు ఆ పాత్రలో కనిపించాల్సింది ఎవరో తెలుసా? చిత్రాంగద సింగ్! ఆమెకు డేట్స్ అడ్జెస్ట్మెంట్ కుదరకపోవటంతో ‘క్వీన్’ ఆఫ్ బాలీవుడ్ లక్కీ ఛాన్స్ కొట్టేసింది.

‘రాంఝణా’ సినిమా ధనుష్ కెరీర్ లో ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోయింది. కానీ, ఆయన చేసిన పాత్రలో షాహిద్ కపూర్ కనిపించి ఉంటే? అదే జరిగి ఉండేది. కానీ, షాహిద్ పెద్దగా కన్విన్స్ అవ్వక ‘రాంఝణా’ ఆఫర్ రిజెక్ట్ చేశాడట. అప్పుడు ఆనంద్ ఎల్. రాయ్ బంపర్ ఆఫర్ తో ధనుష్ ని కలిశాడు…

‘మన్ మర్జియా’ సినిమాలో అభిషేక్ బచ్చన్, తాప్సీ నటించారు. కానీ, ఆనంద్ ఎల్. రాయ్ మొదట ఆయుష్మాన్ ఖురానా, భూమి పెడ్నేకర్ ని అనుకున్నాడు. అంతే కాదు, వారితోనే పది రోజుల షూటింగ్ కూడా పూర్తి చేశాడు. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల షూట్ మధ్యలో ఆగిపోయింది. ఆనంద్ హీరో, హీరోయిన్ ఇద్దర్నీ మార్చేసి అభిషేక్, తాప్సీలను తెరపైకి తెచ్చాడు!

‘జీరో’ సినిమా ఆనంద్ ఎల్. రాయ్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్. ఆ పీడకలని అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు దీపికా పదుకొణే, కరీనా కపూర్! అనుష్క శర్మ చేసిన పాత్రని ఆనంద్ మొదట దీపికాకి ఆఫర్ చేశాడట. ఆమె డేట్స్ లేవంటూ రిజెక్ట్ చేసింది. అలాగే, ‘జీరో’ సినిమాలో కత్రీనా క్యారెక్టర్ ని కరీనా వద్దకు తీసుకెళ్లాడట ఆనంద్. కానీ, ఆమె కొన్ని వ్యక్తిగత కారణాలతో ‘నో’ చెప్పిందట. అలా షారుఖ్ సరసన ‘జీరో’లో దీపికా, కరీనా బదులు అనుష్క శర్మ, కత్రీనా కనిపించారు…

ఆనంద్ ఎల్. రాయ్ నెక్ట్స్ బాక్సాపీస్ వద్దకి ‘అత్రంగీ రే’ సినిమాతో రాబోతున్నాడు. అయితే, ధనుష్, సారా అలీఖాన్ కూడా నటిస్తోన్న ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ది ప్రధాన పాత్ర. ఆయన చేస్తోన్న క్యారెక్టర్ మొదట హృతిక్ రోషన్ వద్దకి వెళ్లింది. ‘జీరో’తో భారీ ఫ్లాపును మూటగట్టుకున్న ఆనంద్ తో హృతిక్ సినిమా చేయటానికి ఇష్టపడలేదట! దాంతో ఖిలాడీ స్టార్ ఎంట్రీ ఇచ్చేశాడు. చూడాలి మరి, అక్షయ్, ధనుష్, సారా అలీఖాన్ మల్టీ స్టారర్ ‘అత్రంగీ రే’… ఆనంద్ ఎల్. రాయ్ కు ఎలాంటి బాక్సాఫీస్ ఫలితాన్ని మిగులుస్తుందో!