NTV Telugu Site icon

SIIMA 2024: బెస్ట్ యాక్టర్ (క్రిటిక్స్) అవార్డు అందుకున్న ‘చిన్న కొండ’

Untitled Design (19)

Untitled Design (19)

దుబాయ్ లో ఘనంగా జరిగిన సైమా అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ అవార్డ్ అందుకున్నా యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ. “బేబి” సినిమాలో ఆయన హార్ట్ టచింగ్ పర్ ఫార్మెన్స్ కు సైమా అవార్డ్ సొంతమైంది. హీరో రానా చేతుల మీదుగా ఈ అవార్డ్ అందుకున్నారు ఆనంద్ దేవరకొండ.

Also Read : 3Movie4K : ఇదెక్కడి క్రేజ్ రా.. ధనుష్ ‘3’ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతంటే.?

ఈ సందర్భంగా హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ “లైఫ్ ఫుల్ సర్కిల్ లా వస్తుందని నాని అన్న చెప్పిన మాటలు నిజమవుతున్నాయి. మా అన్నయ్య విజయ్ కు ఫస్ట్ సైమా అవార్డ్ రానా అన్న చేతుల మీదుగా ఇచ్చారు. ఇప్పుడు నాకు కూడా ఫస్ట్ సైమా ఆయనే అందించారు. బేబి సినిమా మా టీమ్ కు లైఫ్ ఇచ్చింది. ఎస్ కేఎన్ అన్నతో సహా మా టీమ్ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు మీ అన్న విజయ్ ను చూసే వచ్చావ్ కదా అని అడిగేవారు. అది కొంతవరకు నిజమే. అయితే పూర్తి సమాధానం నాకు దొరకలేదు. సైమా అవార్డ్ దానికి జవాబు ఇస్తుందని అనుకుంటున్నా. దుబాయ్ మాల్ లో ఓ కేరళ అబ్బాయి కలిసి మీ బేబి సినిమా నాకు చాలా ఇష్టం. అలాంటి మంచి సినిమా చేసినందుకు థ్యాంక్స్ అని అన్నాడు. సినిమాను ప్రేమించే అలాంటి ప్రేక్షకులు ఉన్నంతవరకు నేను నటిస్తూనే ఉంటా” అని అన్నారు.

బేబి సినిమా ఆనంద్ దేవరకొండకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఈ సినిమాలో భగ్న ప్రేమికుడిగా ఆనంద్ నటన ప్రేక్షకుల మనసులను తాకింది. సైమా అవార్డ్స్ లో బేబి సినిమాకు బెస్ట్ యాక్టర్ క్రిటిక్ అవార్డ్ దక్కడం ఆనంద్ పడిన కష్టానికి, ఆయన నట ప్రతిభకు దక్కిన బహుమతి అనుకోవచ్చు. ఈ అవార్డ్ ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని మంచి సినిమాల్లో ఆనంద్ నటించబోతున్నాడు.

Show comments