టాలీవుడ్‌లో సరికొత్త వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న రా అండ్ రస్టిక్ చిత్రం ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుప్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తుండగా, కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విశేషం ఏమిటంటే, ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన ఇందులో ఓ కీలక పాత్ర కూడా పోషించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా.. తాజాగా మేకర్స్ మరో మాసీ అప్‌డేట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలోని మోస్ట్ పవర్ పుల్ మాస్ సాంగ్‌ను రియల్ హీరో సోనూ సూద్ తన చేతుల మీదుగా లాంచ్ చేశారు. ‘డర్టీ గ్యాంగ్ స్టర్స్’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సినిమా ఏ స్థాయిలో రా అండ్ రస్టిక్‌గా ఉండబోతుందో స్పష్టం చేస్తోంది. ఈ పాటను విడుదల చేసిన అనంతరం సోనూ సూద్ చిత్ర యూనిట్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలపడమే కాకుండా, సినిమా ఘనవిజయం సాధించాలని మనసారా ఆకాంక్షించారు. ఈ మాస్ నంబర్‌కు కేకే అద్భుతమైన సాహిత్యాన్ని అందించగా.. పృథ్వీ చంద్ర, ఈకే తమ శక్తివంతమైన గొంతుతో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. దేవ్‌జండ్ అందించిన బాణీలు ఎంతో ఇంటెన్స్‌గా ఉండి, శ్రోతలకు సరికొత్త అడ్రినల్ రష్‌ను ఇస్తున్నాయి. మాస్ ఆడియెన్స్‌ను ఇన్‌స్టంట్‌గా ఆకట్టుకునేలా ఈ పాట కూర్పు ఉంది. ఇందులో కనిపిస్తున్న విజువల్స్, నేచురల్ లొకేషన్స్, రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి.

