Anakapalli : ఆకట్టుకునేలా ‘అనకాపల్లి’ ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో రా అండ్ రస్టిక్ జోనర్లో తెరకెక్కుతున్న సంచలన చిత్రం ‘అనకాపల్లి’. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కాండ్రేగుల కుమార్ రాజా సహ నిర్మాతగా వ్యవహరించగా, త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఒక ముఖ్య పాత్రలో కూడా మెరిశారు. తాజాగా విశాఖపట్నంలో వైభవంగా జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 వేదికపై ‘అనకాపల్లి’ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. టాలీవుడ్ థండర్స్ టీమ్‌తో పాటు హీరోలు శ్రీకాంత్, సుధీర్ బాబు, తరుణ్, అశ్విన్ బాబు మరియు ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్. థమన్ తదితరులు వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ ట్రైలర్‌ను ఆవిష్కరించి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు.
విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చింది. హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమకథ ఎంతో ఫ్రెష్‌గా ఉండటంతో పాటు, తారక్ పొన్నప్ప పవర్ఫుల్ విలనిజం సినిమాకి ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. ఎంతో నేచురల్‌గా కట్ చేసిన యాక్షన్ సీక్వెన్సులు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉన్నాయి. మిడిల్ క్లాస్ తల్లిదండ్రులుగా త్రినాథరావు నక్కిన, ఇంద్రజ నటిస్తున్న తీరు చూస్తుంటే కుటుంబ ప్రేక్షకులకు కావాల్సినంత భావోద్వేగం ఈ చిత్రంలో ఉందని స్పష్టమవుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ యూత్, మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే అన్ని హంగులతో ఈ ట్రైలర్‌ను రూపొందించారు.
Also Read
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
- Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!