Site icon NTV Telugu

మాచో రిప్డ్ లుక్ లో నాగశౌర్య… పిక్ వైరల్

An absolute Macho Ripped look of Naga Shaurya

చాక్లెట్ బాయ్ నాగశౌర్య టాలీవుడ్ లోని టాలెంటెడ్ యంగ్ హీరోలలో ఒకడు. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇటీవలే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020 లో డాషింగ్ హీరో 5 వ స్థానాన్ని దక్కించుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో పోస్ట్ చేసిన జిమ్ వర్కౌట్ సెషన్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో నాగశౌర్య మాచో రిప్డ్ లుక్ లో కండలు తిరిగిన దేహదారుఢ్యంతో ఆకట్టుకుంటున్నాడు. శౌర్య తన వ్యక్తిగత శిక్షకుడి సమక్షంలో లాక్డౌన్ సమయంలో కూడా కఠినంగా వర్క్ ఔట్లు చేస్తున్నాడు. మొదటిసారి లాక్డౌన్ సమయంలో తన సిక్స్ ప్యాక్ లుక్ తో అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు శౌర్య. తాజాగా మరోసారి మ్యాన్లీ లుక్ తో అమ్మాయిల మనసుల్ని దోచేస్తున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య వరుడు కావలెను, లక్ష్య, ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, అనీష్ కృష్ణ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు.

Exit mobile version