కొందరు హీరోయిన్స్ తొలి చిత్రంతోనే సంచలనం అవుతారు. అయితే, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ఫస్ట్ మూవీలోని జోష్ ని తరువాత కూడా కంటిన్యూ చేస్తారు. అమీషా పటేల్ ఖచ్చితంగా ఆ వర్గం కాదు. మొదటి సినిమా ‘కహోనా ప్యార్ హై’! హృతిక్ రోషన్ కి కూడా అదే ఫస్ట్ మూవీ! కానీ, హృతిక్ ఇప్పటికీ టాప్ స్టార్ గా కొనసాగుతుండగా అమీషా మాత్రం దాదాపుగా తెరకు దూరమైపోయింది. ఆమె ఈ మధ్యలో చేసిన చెప్పుకోదగ్గ చిత్రం అంటూ ఏదీ లేదు!
తెలుగులో పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడిన బీ-టౌన్ బ్యూటీ ఒక దశలో బిజీ హీరోయిన్ గా కొనసాగినా వరుసగా హిట్ మూవీస్ ఇవ్వలేకపోవటంతో డిమాండ్ తగ్గింది.
read also : అజయ్ తో కంగనా రొమాన్స్! కంగుతిన్న కాజోల్!
కానీ, ఈ 40 ప్లస్ బ్యూటీ అందం మాత్రం కొంచెం కూడా తగ్గ లేదు. ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించటం కూడా లేదు. సొషల్ మీడియాలో అమీషా పోస్ట్ చేసే ఫోటోలు, వీడియోలు యంగ్ బ్యూటీస్ కి కూడా అసూయ పుట్టిస్తుంటాయి. ఆమె కంటే సగం చిన్నోళ్లైన టీనేజీ కుర్రాళ్లకి కూడా మతి తప్పిస్తుంటాయి. అమీషా తాజాగా ఓ హాట్ పిక్ పోస్ట్ చేసింది. కరోనా ప్రపంచాన్ని కబళించక ముందటి ప్లాష్ బ్యాక్ వెకేషన్ ఫోటో అది. బ్లాక్ బికినీ టాప్ వేసి బ్లూ జీన్స్ లో అదరగొట్టేసింది అందాల రాశి! మరో వీడియోలో అలా వయ్యారంగా నడిచేస్తూ తన ‘బ్యాక్ గ్రౌండ్’ ప్రదర్శనకు పెట్టింది! కరోనా పీడ విరగడైతే… అమాంతం ఆకాశంలో ఎగురుకుంటూ విదేశీ వెకేషన్ కు వెళ్లిపోతానన్నట్టు ఉంది… అమీషా మూడ్!
