‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మాణంలో, రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో రూపొందిన సరికొత్త చిత్రం ‘అమీర్ లోగ్’. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సమర్పణలో ‘స్పిరిట్ మీడియా’ ఈ చిత్రాన్ని ఆగస్ట్ 21న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయబోతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ ఆసక్తికర విషయాలు పంచుకుంది.
దర్శకుడు రమణ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘అమీర్ లోగ్’ చిత్రం హైదరాబాద్ ప్రజలకు ప్రతీకగా ఉంటుంది. ఈ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అందరినీ ఏడ్పిస్తాం, నవ్విస్తాం. కంటెంట్ మీదున్న నమ్మకంతోనే అందరం ఎంతో కాన్ఫిడెంట్‌గా, సంతోషంగా ఉన్నాం. హైదరాబాదీ వైబ్ ఉన్న సినిమా వచ్చి చాలా రోజులు అవుతోంది. ‘డాలర్ డ్రీమ్స్’, ‘పెళ్లి చూపులు’, ‘బలగం’ రేంజ్‌లో మా ‘అమీర్ లోగ్’ ఉంటుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయి యోగి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎస్వీకే సినిమాటోగ్రఫీ, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్, స్మరణ్ సాయి సంగీతం అందించారు.

