Ameer Log: ‘అమీర్ లోగ్’.. ‘సీదా హెలికాప్టర్ షాట్’ సాంగ్ అవుట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైవిధ్యమైన కంటెంట్‌తో వస్తున్న చిన్న సినిమాలకు ఇండస్ట్రీలోని పెద్ద స్టార్ల మద్దతు లభిస్తే ఆ చిత్రాల రేంజ్ అమాంతం పెరిగిపోతుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే క్రేజ్‌తో టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది ‘అమీర్ లోగ్’ మూవీ. నూతన నటీనటులతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు థియేట్రికల్ పంపిణీ హక్కులను ప్రముఖ నటుడు రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సంస్థ దక్కించుకోవడంతో, ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ జోష్‌ను ఇలాగే కొనసాగిస్తూ, తాజాగా చిత్ర బృందం “సీదా హెలికాప్టర్ షాట్” అనే ఫుల్ ఎనర్జిటిక్ సాంగ్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి స్వరపరిచిన ఈ పాట యువతను ఆకట్టుకునేలా ఒక పక్కా ‘స్ట్రీట్ ఆంథమ్’లా సాగుతోంది. కథలోని ప్రధాన పాత్రల మధ్య ఉండే బలమైన స్నేహాన్ని, వారి అనుబంధాన్ని ఈ పాటలో అద్భుతంగా ఆవిష్కరించారు. సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన MC హరి స్వయంగా ఈ గీతాన్ని రచించి అందులో నటించడం విశేషం. పక్కా లోకల్ యాస, గల్లీ కుర్రాళ్ల జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఉన్న పదాలు ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. జీవితంలో విజయం సాధించాలనే తపన, అలుపెరుగని ఆత్మవిశ్వాసం ఉన్న ప్రతి కుర్రాడికి ప్రతీకగా ఈ పాట నిలుస్తోంది. ఇందులో వాడిన కొన్ని లైన్స్ యువతలో జోష్ నింపుతున్నాయి. లిరికల్ వీడియోలో విజువల్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ప్రధాన తారాగణం ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తూ ఆకట్టుకుంది. ముఖ్యంగా హైదరాబాద్ గల్లీల వాతావరణాన్ని ఎస్వీకే తన సినిమాటోగ్రఫీతో చాలా సహజంగా, అద్భుతంగా స్క్రీన్‌పై చూపించారు. రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ వర్క్ ఈ పాటకు మరింత హైప్ తీసుకొచ్చింది. అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై నిర్మాత మాధవి రెడ్డి సోమ నిర్మిస్తున్న తొలి ప్రయత్నం ఇది. ఈ చిత్రానికి రమణ రెడ్డి సోమ దర్శకత్వం వహించగా, మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీలో వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!