Ameer Log: మిడిల్ క్లాస్ గుండెలను పిండేస్తున్న ‘అమీర్ లోగ్’ సాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. పక్కా లోకల్ ఫ్లేవర్‌తో హైదరాబాద్‌లోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్న ఈ సినిమాను టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటికి చెందిన ‘స్పిరిట్ మీడియా’ సంస్థ తెలుగులో ఆగస్ట్ 21న అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయబోతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను హోరెత్తిస్తోంది. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన పాటలన్నీ చార్ట్ బస్టర్లుగా నిలవగా.. తాజాగా ఈ సినిమా ఆత్మను తెలిపే మరో అందమైన సోల్ ఫుల్ గీతాన్ని మేకర్స్ విడుదల చేశారు. మిడిల్ క్లాస్ బతుకుల్ని, వారి కష్టాలను అద్దం పట్టేలా ‘కాసుల కళ’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నిఖ్లేష్ సుంకోజి రాసిన సాహిత్యం ఎంతో అర్థవంతంగా ఉండి ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తోంది. ఇక స్మరణ్ సాయి అందించిన బాణీలు గుండెల్ని హత్తుకునేలా ఉండగా.. ఏక్నాథ్ మధురమైన గాత్రం ఈ పాటకు మరింత ఫీల్‌ను తెచ్చిపెట్టింది. ఎస్వీకే సినిమాటోగ్రఫీ, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్, స్మరణ్ సాయి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి!
Also Read
- Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
- Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
- Balakrishna vs Nagarjuna: 22 ఏళ్ల క్రితం నాగ్ గెలిచాడు.. ఇప్పుడు బాలయ్య లెక్క సరిచేస్తాడా! క్రిస్మస్ విన్నర్ ఎవరు?
- Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!