Ambas Revenge : ఒక్క మనిషి కూడా నటించని తొలి ఏఐ(AI) తెలుగు సినిమా.. మహాభారత నేపథ్యంతో ‘అంబాస్ రివెంజ్’ టీజర్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనుషులు ఎవరూ నటించకుండా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో మాత్రమే రూపొందిన సరికొత్త విజువల్ వండర్ “అంబాస్ రివెంజ్”. భారతీయ ఇతిహాసం మహాభారతంలోని అంబ పాత్ర స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో మీడియా సమక్షంలో చిత్ర బృందం అంగరంగ వైభవంగా విడుదల చేసింది. నక్క తోక ఫిలిమ్స్ బ్యానర్‌పై యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి, రాణి మాడిసన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జైవర్ధన్ మేడి దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతంలో భీష్ముడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన అంబ, మరో జన్మలో శిఖండిగా మారి భీష్మునిపై ఎలా పగ తీర్చుకుందనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా అంబ పేరుతో ఉన్నప్పటికీ, కథ మొత్తం శిఖండి కోణం నుంచి సాగుతుందని దర్శకుడు జైవర్ధన్ మేడి వెల్లడించారు. కేవలం ప్రధాన పాత్రలను పరిచయం చేయడం కోసమే డైలాగ్స్ లేకుండా ఈ టీజర్‌ను కట్ చేశామని, త్వరలోనే డైలాగ్స్‌తో కూడిన పూర్తి స్థాయి ట్రైలర్‌ను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.
సాధారణంగా ఏఐ టెక్నాలజీతో సినిమా అనగానే ఖర్చు తక్కువ ఉంటుందని భావిస్తారని, కానీ అది నిజం కాదని నిర్మాత యోగేంద్ర ప్రసాద్ పొట్లూరి స్పష్టం చేశారు. ఏఐ రంగంలో ఒక టూల్ వాడేలోపే సాంకేతికత అప్డేట్ అయి కొత్త టూల్ వస్తుండటంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందని ఆయన తెలిపారు. సోషల్ మీడియా రీల్స్ ద్వారా ప్రేక్షకులకు ఏఐ పట్ల అవగాహన పెరిగిందని, ఈ సినిమా వారికి కచ్చితంగా ఒక విజువల్ ఫీస్ట్‌లా ఉంటుందని ఎడిటర్ హ్యారీ బ్రెయిన్, విజువల్ డైరెక్టర్ సాయి నేత పేర్కొన్నారు. నేటి తరానికి అర్థమయ్యేలా రెండు పాటలతో ఈ చిత్రాన్ని మలిచామని డైలాగ్ రైటర్ కిషోర్ కుమార్ ఏనుగు, సంగీత దర్శకుడు ప్రమోద్ ఎంసి తెలిపారు.
Also Read
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
- Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Indian 3 : ఇండియన్ 3.. సేనాపతి తిరిగివస్తున్నాడు..
- Ramayana : 'రామాయణ' ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
తాజావార్తలు
-
INDIA Alliance March: ముందుగా లంచ్, ఆ తర్వాత నిరసన.. కాంగ్రెస్ SIR నిరసన ప్లాన్..
-
Super-Duper El Nino: ఎల్‌నినోపై మరోసారి బిగ్ అలర్ట్.. ప్రపంచం ఎర్రగా మారుతోందని హెచ్చరిక
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!