NTV Telugu Site icon

‘దృశ్యం-2’కు అమెజాన్ ప్రైమ్ భారీ డీల్ ?

Amazon Prime’s huge deal for Venkatesh’s Drushyam 2

విక్టరీ వెంకటేశ్‌, మీనా జంటగా తెరకెక్కుతున్న మూవీ ‘దృశ్యం2’. జీతూ జోసెఫ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బాబు దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి వెంకటేశ్ తన షూట్‌ను పూర్తి చేసుకున్నారు. కాగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. కరోనా కారణంగా మలయాళ చిత్రం ‘దృశ్యం2’ను ఓటీటీలోనే విడుదల అయ్యింది. అమెజాన్ ప్రైమ్ ‘దృశ్యం-2’ డైరెక్ట్ డిజిటల్ హక్కుల కోసం భారీ ఆఫర్‌తో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. కరోనా విలయతాండవం చేస్తున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో సురేష్ బాబు ‘దృశ్యం-2’ను నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం అమెజాన్ ప్రైమ్ ‘దృశ్యం-2’ డిజిటల్ హక్కుల కోసం భారీగా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ‘దృశ్యం-2’ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ మొత్తానికి ఎంత ఆఫర్ చేసిందనే విషయం మాత్రం తెలియలేదు. ఈ విషయంపై సురేష్ బాబు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. సురేష్ బాబు ప్రస్తుతం చివరి దశలో ఉన్న ‘నారప్ప’పై దృష్టి సారించారు. ఇక ఇటీవలే ‘దృశ్యం-2’ మలయాళ వెర్షన్‌ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ‘దృశ్యం 2’ తెలుగు వర్షన్ ను ఫాదర్స్ డే కానుకగా జూన్ 20వ విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.