Site icon NTV Telugu

వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమాకు అమెజాన్ బిగ్ ఆఫర్ ?

Mythri Movie Makers sign Vaisshnav Tej for two films

మెగా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన వైష్ణవ్ తేజ్ మొదటి చిత్రంతోనే అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన తొలి చిత్రం “ఉప్పెన” బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఇప్పుడు వైష్ణవ్ రెండవ సినిమాపై దృష్టి పెట్టారు. ఇది చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకుంది. వైష్ణవ్ తేజ్ రెండవ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం “కొండపొలం” నవల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ లేడీ లీడ్ రోల్ చేస్తుంది.

Read Also : టోక్యో రియల్ హాకీ చూస్తూ… రీల్ హాకీ జ్ఞాపకాలు నెమరవేసుకున్న ‘చక్ దే’ చిత్రాశీ!

ఈ విలేజ్ డ్రామా మేకర్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో నుండి పెద్ద ఆఫర్‌ను అందుకున్నారనేది తాజా సమాచారం. ఆఫర్‌కు సంబంధించిన ఖచ్చితమైన వివరాలు ఇంకా తెలియరాలేదు. అమెజాన్ ప్రైమ్ లాభదాయకమైన ఆఫర్‌ ఇవ్వడంతో మేకర్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని నేరుగా డిజిటల్ రిలీజ్ చేయడం గురించి ఆలోచిస్తున్నారు. అతిత్వరలోనే మేకర్స్ దీనిపై నిర్ణయం తీసుకుంటారు. తదనుగుణంగా అధికారిక ప్రకటన వస్తుంది. మరోవైపు వైష్ణవ్ తన మూడవ చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. ఇది త్వరలో సెట్స్‌పైకి రానుంది. నాగార్జున అక్కినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version