NTV Telugu Site icon

Amaran : ఆ హీరోయిన్ ‘అన్న’ అంది.. ఎంతో బాధపడ్డాను! స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Amaran

Amaran

శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ అమరన్’. రాజ్కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. అమరన్ ఏప్రిల్ 25న షోపియాన్‌లోని ఖాజీపత్రి ఆపరేషన్‌లో యాక్షన్‌లో అమరులైన AC అవార్డు గ్రహీత మేజర్ ముకుంద్ వరదరాజరన్ జీవితాన్ని ఆధారంగా నిర్మించిన బయోపిక్. దీపావళి కానుకగా అక్టోబరు 31న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది అమరన్. ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ అద్భుత రెస్పాన్స్ దక్కించుకుంది.

తాజగా అమరన్ ఆడియో లాంఛ్ కార్యక్రమం చెన్నై లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా  దర్శకులు లోకేష్ కనగరాజ్ , మణిరత్నం హాజరయ్యారు. కాగా ఈ కార్యక్రమంలో హీరో శివ కార్తికేయన్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన సాయి పల్లవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. శివ కార్తికేయన్ మాట్లాడుతూ ” ప్రేమమ్ సినిమా చూసి మలర్ టీచర్ గా అద్భుతంగా నటించావ్ అని సాయి పల్లవికి కాల్ చేసి.. హలొ సాయి పల్లవి నేను శివ కార్తికేయన్ మాట్లాడుతున్న మలర్ గా సూపర్ గా చేసావ్ అని చెప్పా అందుకు సాయి పల్లవి అన్నా థాంక్యూ అన్నా అని పిలిచింది. మలర్ సాంగ్ లో అలాగే క్లైమాక్స్ లో పర్ఫామెన్స్ చాలా బాగుంది అంటే అయ్యో అన్నా థాంక్యూ సో మచ్ అన్నా అని అంది. ఒక్కసారిగా భాదపడ్డాను( నవ్వుతూ).కానీ ఆ రోజు చెప్పా ఎదో ఒకరోజు మనం కలిసి నటిస్తాం అని ఇన్నేళ్ల తర్వాత అమరన్ లో కలిసి చేసాం. సాయి పల్లవి అద్భుతమైన నటి” అని అన్నారు.

Show comments