NTV Telugu Site icon

AlluArjun : పుష్ప -2 హైదరాబాద్ ప్రీరిలీజ్ ఈవెంట్ లేనట్టే.. కారణం ఇదే..?

Pushpa2

Pushpa2

నిన్నటికి నిన్న టాలీవుడ్ లో ఓ న్యూస్ గుప్పుమంది. పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదిక ఫిక్స్ అయిందని,భారీ ఎత్తున చేయన్నున్నారు అనే వార్త తెగ హల్ చల్ చేసింది. హైదరాబద్ లోను యూసుఫ్ గూడాలోని పోలీస్ హెడ్ క్వార్ట్రర్స్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అంతా రెడీ అని కూడా టాక్ నడిచింది. కానీ అవన్ని పుకార్లుగానే మిగిలాయి. పుష్పా నిర్మాతలు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతులు కోరిన మాట వాస్తవమే. కానీ అనుమతులు రాలేదు.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ డేట్ ప్రకటించారు. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేసారు మేకర్స్. వాస్తవానికి ముందు ఈ ఈవెంట్ ను LB స్టేడియం లో అనుకున్నారు కానీ సెట్ కాలేదు. అది కాదని గచ్చిబౌలి స్టేడియం కావాలని అడిగారు కానీ అందుకు పోలీస్ శాఖ పర్మిషన్ ఇవ్వలేదు. చివరిగా యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో ఒకే అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఓ చిన్న ఇబ్బంది ఎదురైంది. యూసఫ్ గూడా గ్రౌండ్ లో ఇటీవల కన్వెన్షన్ నిర్మించారు. పుష్ప ఈవెంట్ అంటే భారీ స్థాయిలో ఉంటుంది. సో అక్కడ కూడా సెట్ అవధాని భావించి అనుమతులు ఇవ్వలేదు. ఇక చేసేదేమి లేక తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేసి ఇక్కడా సక్సెస్ మీట్ పెట్టుకుందా అనే ఆలోచనలో ఉంది పుష్ప యూనిట్.

Show comments