NTV Telugu Site icon

AlluArjun : గుంటూరుకారం ట్రైలర్ వ్యూస్.. రికార్డు బద్దలు కొట్టిన పుష్ప -2

Trailer Pushpa2

Trailer Pushpa2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప ఎంతటి ఘన విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పుష్ప కు కొనసాగింపుగా వస్తోంది పుష్ప -2. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : Pushpa -2 : గత పదేళ్లలో ఇలా జరగడం మొదటిసారి : మైత్రీ రవి

తాజాగా పుష్ప ట్రైలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ ఎన్ని మిలియన్ వ్యూస్ రాబడుతుందో అనే చర్చ టాలీవుడ్ లో నెలకొంది. ఇప్పటి వరకు టాలీవుడ్ హయ్యెస్ట్ వ్యూస్ రాబట్టిన ట్రైలర్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం పేరిట ఉంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లో 37.68 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ఇక తాజాగా విడుదలైన పుష్ప -2 ట్రైలర్ రిలీజ్ అయిన కేవలం 14 గంటల 52 నిమిషాలలో గుంటూరుకారం రికార్డు బద్దలు కొట్టి 37.74 మిలియన్ వ్యూస్ రాబట్టి ఆల్ టైమ్ ఇండిస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డు కేవలం తెలుగు వ్యూస్ మాత్రమే. ఇక హింది, తమిళ్, మలయాళంకలిపి 12 గంటల్లో 60 మిలియన్ వ్యూస్ రాబట్టింది వ్యూస్ రాబట్టిన పుష్ప సౌత్ ఇండియా మోస్ట్ వ్యూస్ రాబట్టిన NO -1 ట్రైలర్ గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక 24 గంటల్లో మొత్తం ఎన్ని వ్యూస్ రాబడుతుందో, ముందు ముందు ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందొ చూడాలి.

Show comments