Site icon NTV Telugu

Allu Arjun: కోస్తే ఎల్లో బ్లడ్.. బాలయ్య ముందే అల్లు అర్జున్ సంచలన వ్యాఖ్యలు

Allu Arjun Balakrishna

Allu Arjun Balakrishna

నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో కి సంబంధించిన నాలుగో సీజన్ ని ఇప్పుడు నడుస్తోంది. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ ఎపిసోడ్ నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ ఎపిసోడ్లో అనేక అంశాలకు సంబంధించి అల్లు అర్జున్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే అన్నిట్లో ఎక్కువగా ఒక విషయం మాత్రం వైరల్ అవుతుంది. అదేంటంటే గతంలో అల్లు అర్జున్ ఒక వైన్ షాపులోకి వెళ్లి ముందు కొంటున్న వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో పాత వీడియో అయినా సరే ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఇదే విషయాన్ని గురించి నందమూరి బాలకృష్ణ ప్రస్తావించారు.

CM Chandrababu: ప్రపంచానికి ఫుడ్ బాస్కెట్‌గా ఏపీ అవతరిస్తుంది

ఆ మందు ఎవరికోసం కొన్నావని అడిగారు. దానికోసం అల్లు అర్జున్ స్పందిస్తూ నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అతని పేరు సందీప్ రామినేని అతను విజయవాడ కుర్రాడు అతను మీకు పెద్ద అభిమాని ఒక రకంగా కోస్తే ఎల్లో బ్లడ్ వస్తుంది అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పచ్చి టిడిపి అభిమానిని ఇలా కోస్తే ఎల్లో బ్లడ్ వస్తుందని సోషల్ మీడియాలో అలాగే సరదాగా స్నేహితుల మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటారు. అదే విషయాన్ని నందమూరి బాలకృష్ణ ముందు అల్లు అర్జున్ ప్రస్తావించడం గమనార్హం. ఆ తర్వాత కాసేపటికే సదరు సందీప్ ని స్టేజి మీదకు తీసుకు వచ్చిన అల్లు అర్జున్ అతను తన బెస్ట్ ఫ్రెండ్ అని అతను లేకుంటే తాను లేను అన్నట్లుగా కామెంట్ చేశాడు. ఇక ఈ వీడియోకి సంబంధించి అనేక వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను అల్లు అర్జున్ మనసు విప్పి మాట్లాడారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణతో అల్లు అర్జున్ రాపో గురించి కూడా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

Exit mobile version