Site icon NTV Telugu

Thandel: తండేల్ రాజ్ కోసం పుష్ప రాజ్.. రేపే జాతర

Pushpa Raj For Thandel Raj

Pushpa Raj For Thandel Raj

జరుగుతున్న ప్రచారమే నిజమైంది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న తండేల్ చిత్రం హైదరాబాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పుష్ప రాజ్ అలియాస్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాని బన్నీ వాసు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఒక రేంజ్ లో చేస్తోంది సినిమా యూనిట్.

Laila: కోయ్ కోయ్ కోడ్ని కోయ్ అంటున్న విశ్వక్

నాగచైతన్య హీరోగా నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో సినిమా మీద మరింత కేర్ తీసుకుంటున్నారు. ఇప్పటికే చెన్నై ముంబై వెళ్లి ప్రమోషన్స్ చేసి వచ్చిన యూనిట్ రేపు హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతోంది. అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా హాజరు కాబోతున్న ఈ ఈవెంట్ రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్లు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా గుజరాత్ తీరానికి వెళ్లి చిక్కుకున్న శ్రీకాకుళం జాలర్ల నిజ జీవిత కథతో సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Exit mobile version