NTV Telugu Site icon

Allu Arjun : పుష్ప -2 ట్రైలర్ పై వాళ్లు స్పందిచలేదెందుకు..?

Pushpa2

Pushpa2

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న నటించిన చిత్రం పుష్ప 2. ఈ ట్రైలర్ ను పాట్నాలో గ్రాండ్ గా రిలీజ్ చేసారు మేకర్స్. ఈ చిత్ర ట్రైలర్ ను ఉద్దేశించి ప్రతి ఒక్కరు సుకుమార్ ను అలాగే అల్లు అర్జున్ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. పుష్ప పాత్రలో అల్లు అర్జున్ నటన ఓ రేంజ్ లో చేసాడని, రిలీజ్ రోజు థియేటర్స్ లో బన్నీ విశ్వరూపం ఆడియెన్స్ ను ఆశర్య పరుస్తుంది. అలాగే సుకుమార్ టేకింగ్ అబ్బురపరుస్తుందని సోషల్ మీడియాలో పలువురు సెలెబ్రిటీస్ ట్వీట్స్ చేసారు.

Also Read : Cinema Special : బడా మూవీస్ వల్ల నిర్మాతలు చితికిపోతున్నారా..?

ఇది కొంత వరకు బాగానే ఉంది కాని మెగా ఫ్యామిలీ నుండి ఒక్కరు కూడా పుష్ప ట్రైలర్ పై స్పందించలేదు. ఇప్పుడిదే ఇంస్ట్రీలో హిట్ టాపిక్ గా మారింది. ఇటీవల అల్లు కాంపౌండ్ కు మెగా కాంపౌండ్ కు ఫ్యాన్ వార్స్ తార స్థాయికి చేరుకున్నాయి. జస్ట్ పోస్టర్ వచ్చిన సరే ట్రోలింగ్ హద్దులు దాటుతోంది. మెగా బ్రాండ్ లేకుండా తమ హీరో పాన్ ఇండియా రేంజ్ కు చేరుకున్నాడని బన్నీ ఫాన్స్ అంటుంటే,  బన్నీ ఇంత వాడు అవడానికి మెగా ఫ్యామిలి అండ కారణం అని, కానీ ఇప్పుడు తన సొంత ఆర్మీ వల్లే ఇదంతా సాధ్యం అయిందనడం మెగా ఫ్యాన్స్ కోపానికి కారణం అయింది. టాలీవుడ్ లో రిలీజ్ అయిన ప్రతి సినిమాకు విష్ చేసే మేగాస్టార్ సైతం కామ్ గా ఉండడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. మరోవైపు మెగాస్టార్ విశ్వంభర టీజర్ రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్  కూడా కనీసం స్పదించలేదు.   2024 ఎన్నికల్లో మొదలైన మెగా vs అల్లు అంటూ మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా మారింది. ఈ ప్రభావం అటు గేమ్ చెంజర్, ఇటు పుష్ప -2  కలెక్షన్స్ పై పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

Show comments