Allu Arjun: అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun to grace the Pre-release event of Maruthinagar Subramanyam: సుకుమార్ భార్య తబిత సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. రావు రమేష్ కథానాయకుడిగా రూపొందిన చిత్రమిది. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ… అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ బుధవారం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఆగస్టు 21న హైదరాబాద్‌లో ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇప్పటికే ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ను సుకుమార్, తబిత దంపతులు చూశారు.
Jaya Krishna Ghattamaneni : మహేష్ ఫ్యామిలీ నుంచి మరో హీరో.. తల్లోంచి ఊడిపడినట్టున్నాడుగా!
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
వినోదంతో పాటు చక్కటి కుటుంబ విలువలతో తెరకెక్కిన ఈ సినిమా విపరీతంగా నచ్చడంతో తన సమర్పణలో విడుదల చేయడానికి తబిత ముందుకు వచ్చారు. ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’లో రావు రమేష్, అంకిత్ కొయ్య తండ్రి కుమారుల పాత్రలు చేశారు. రావు రమేష్ తన తండ్రి కాదని, తాను అల్లు కుటుంబంలో పుట్టానని, అల్లు అరవింద్ తన తండ్రి – అల్లు అర్జున్ తన అన్నయ్య అనుకునే క్యారెక్టర్ చేశారు అంకిత్ కొయ్య. ప్రేమించిన అమ్మాయిని ఊహించుకుంటూ పాడుకునే పాటల్లోనూ అల్లు అర్జున్ సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ రీ క్రియేషన్ చేశారు. రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాహిత్యం: ఆస్కార్ పురస్కార గ్రహీత చంద్రబోస్, భాస్కరభట్ల, కళ్యాణ్ చక్రవర్తి, అందించారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!