Site icon NTV Telugu

అన్ని భాషల్లోనూ బన్నీ మాటే!

Pushpa

Pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’! తెలుగుతో పాటు ఈ మూవీ తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ క్రిస్మస్ కానుకగా విడుదల కాబోతోంది. ఇటీవల ఐదు భాషల్లోనూ విడుదలైన సాంగ్ సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. విశేషం ఏమంటే… అన్ని అనుకున్నట్టు జరిగితే… ఈ పుష్పరాజ్ ఆల్ ఇండియాలోనే ఓ సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడు. అదేమిటంటే…. ‘పుష్ప’ మూవీ విడుదల కాబోతున్న ఐదు భాషల్లోనూ దర్శకుడు సుకుమార్… అల్లు అర్జున్ తోనే డబ్బింగ్ చెప్పించే ఆలోచనలో ఉన్నాడట. నిజానికి దీనికి సంబంధించిన వార్త కొంతకాలం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బన్నీ ఫ్యాన్స్… ఆల్ లాంగ్వేజెస్ లోనూ అల్లు అర్జున్ డబ్బింగ్ చెబితే బాగుంటుందని కోరుకుంటున్నారు. తాజా సమాచారం ప్రకారం వారి కోరిక నెరవేరబోతున్నట్టు తెలుస్తోంది.

Read Also : “భీమ్లా నాయక్” వచ్చేశాడు… పవర్ ప్యాక్డ్ గ్లిమ్స్

గతంలో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘సాహో’ తెలుగు, హిందీ వర్షన్స్ కు మాత్రమే డబ్బింగ్ చెప్పాడు. అయితే… ‘ట్రిపుల్ ఆర్’ మూవీలో నటిస్తున్న స్టార్ హీరోలు ఎన్టీయార్, రామ్ చరణ్ లతో అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పించే ఛాన్స్ ఉందంటున్నారు. కానీ ఇంతవరకూ అధికారిక సమాచరం ఏదీ రాలేదు. అది జరిగి, ఆ మూవీ దసరాకు విడుదలైతే ఓకే… లేదంటే వారు డబ్బింగ్ చెప్పినా మూవీ జనవరిలో 26న విడుదల అయితే మాత్రం అలా ఆల్ లాంగ్వేజెస్ లో డబ్బింగ్ చెప్పిన ఘనత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కే దక్కుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Exit mobile version