అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పుష్పరాజ్ మ్యాజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ చిత్రం బంపర్ వసూళ్ల నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం 2.30కి ఢిల్లీలో థాంక్యూ ఇండియా ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. మరోపక్క అల్లు అర్జున్ తన తల్లితో చాలా అందమైన చిత్రాన్ని పంచుకున్నాడు. గురువారం, డిసెంబర్ 12న అల్లు అర్జున్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఒక చిత్రాన్ని పంచుకున్నారు. ఇందులో అతను తన తల్లితో కలిసి కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్ ఇంటి ముందు నిలబడి ఉండగా ఎదురుగా ఉన్న కొడుకుని చూసి నటుడి తల్లి నిర్మల ప్రేమగా చూస్తోన్నట్టు కనిపిస్తోంది.
Zebra OTT: ఓటీటీలోకి సత్యదేవ్ ‘జీబ్రా’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇక కొడుకు విజయం సాధించిన సంతోషం తల్లి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశ్వీరదీంచగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. మరోపక్క సినీ నటి రాధిక శ్రీవారిని దర్శించుకున్నారు.స్వామివారి దర్శనార్థం తిరుమల విచ్చేసిన రాధిక వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశ్వీరదించగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు రాధిక.