Pushpa’s Rule to begin in 200 Days: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. కేవలం సౌత్ నుంచి కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఈ సినిమా రెండో భాగం ఎలా ఉండబోతుందా అని ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగాన్ని అంతగా మించి అనిపించేలా తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కాకపోవచ్చని, వాయిదా పడవచ్చని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ ఇటీవలే కచ్చితంగా సినిమా 15వ తేదీ రిలీజ్ అవుతుందని సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
Raja Saab Release: మన చేతుల్లో ఏం లేదు.. మీరు గట్టిగా అనుకున్న డేటుకే రిలీజ్!
పుష్ప గాడి రూలు మరో రెండు వందల రోజుల్లో మొదలు కాబోతుంది అంటూ 200 డేస్ పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. 200 కౌంట్ డౌన్ తో సినిమా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే కచ్చితంగా ఈ సినిమా 15వ తేదీ ఆగస్టు నెలలో రిలీజ్ కావడం ఖాయమని మరోసారి క్లారిటీ ఇచ్చినట్లయింది. ఇక ఈ పుష్ప సెకండ్ పార్ట్ లో హీరోయిన్ గా రష్మిక నటిస్తుండగా ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు సుకుమార్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.