Site icon NTV Telugu

అల్లు అర్జున్ కు దిమ్మతిరిగే రెమ్యూనరేషన్ ?

Allu Arjun Remuneration for Pushpa Movie

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు “అల వైకుంఠపురంలో హిట్ మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆయన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా ఈ చిత్రం నిలిచింది. ప్రస్తుతం “పుష్ప” చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారబోతున్నాడు బన్నీ. ఆ తరువాత బాలీవుడ్ పై కూడా బన్నీ దృష్టి పడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ పై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. “అల వైకుంఠపురంలో” కోసం బన్నీ రూ.35 కోట్లు పారితోషికంగా తీసుకున్నాడు. అయితే “పుష్ప”కు అది డబుల్ అయ్యిందనే వార్తలు ఇప్పుడు విన్పిస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పుష్ప” రెండు భాగాలుగా తెరకెక్కనుంది అని అంటున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుందని ఇటీవల ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పష్టం చేశారు. అల్లు అర్జున్ రెండు భాగాలకు కలిపి సుమారు 70 కోట్ల రూపాయలు వసూలు చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ​”పుష్ప” తర్వాత అల్లు అర్జున్ బాలీవుడ్ అరంగ్రేటం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Exit mobile version