పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రష్ రష్మిక మందన్న జోడీ మరోసారి తెరపై మళ్లీ మెరిపించబోతోందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇప్పటికే ‘పుష్ప’ సిరీస్‌లో ‘శ్రీవల్లి’ పాత్రతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక, బన్నీ సరసన ముచ్చటగా మూడోసారి నటించనున్నట్లు సమాచారం. తాజా బజ్ ప్రకారం, అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ పాన్ వరల్డ్ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మాస్ అండ్ హైటెక్ ఎంటర్టైనర్‌ను సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి అవుతున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.
Also Read : Muruga : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘లార్డ్ మురుగన్’ లో మలయాళ నటి..!
ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్నను ఫైనల్ చేసినట్టు ఇండస్ట్రీ టాక్. ‘పుష్ప’ సిరీస్‌లో బన్నీతో ఆమె కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయిందో చూశాం. అదే మ్యాజిక్ మళ్లీ రిపీట్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ఈ కాంబినేషన్‌ను సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ‘శ్రీవల్లి’ పాత్ర రష్మికను దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చింది. మాస్ ఆడియెన్స్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కి కూడా ఆమె నటన, అభినయం బాగా నచ్చింది. పుష్పరాజ్ పాత్రతో సమానంగా శ్రీవల్లి క్యారెక్టర్‌కు వచ్చిన రెస్పాన్స్ ఇదే విషయాన్ని చెబుతోంది. ఇక అట్లీ వంటి మాస్ కమర్షియల్ స్పెషలిస్ట్ డైరెక్టర్, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా ఐకాన్, రష్మిక మందన్న వంటి నేషనల్ లెవెల్ స్టార్ కలిస్తే, ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అధికారిక ప్రకటన రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఈ వార్త సినీ వర్గాల్లో ప్రస్తుతం బర్నింగ్ హాట్ టాపిక్‌గా మారింది.
