Site icon NTV Telugu

Allu Arjun : ఇంజిన్ లేని బోగిలా వెళ్తున్న నన్ను ఆయన సరైన దారిలో పెట్టారు..

Whatsapp Image 2024 05 07 At 2.03.06 Pm

Whatsapp Image 2024 05 07 At 2.03.06 Pm

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “ఆర్య” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అల్లు అర్జున్ కెరీర్ లోనే “ఆర్య” సినిమా క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ సినిమాలో అల్లు అర్జున్, అను మెహతా జంటగా నటించారు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు .ఆర్య సినిమాతోనే దర్శకుడు సుకుమార్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో ఆర్య సినిమా తెరకెక్కింది.అప్పట్లో ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది.ఈ సినిమా హిట్ అల్లు అర్జున్,సుకుమార్ ,దిల్ రాజు సినీ కెరీర్ కు ఎంతగానో ఉపయోగ పడింది.ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ అయి 20 ఏళ్ళు పూర్తి అవడంతో ఈ మూవీ యూనిట్ స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి ఆర్య మూవీ లో పనిచేసిన టెక్నిషియన్స్ అంతా వచ్చి ఎంతో సందడి చేసారు.

ఆర్య 20 ఇయర్స్ వేడుకలో అల్లు అర్జున్ సుకుమార్ గురించి మాట్లాడుతూ.. నా లైఫ్ లో ఇంపాక్ట్ చూపించిన దర్శకులు సుకుమార్..ఆయన నా లైఫ్ మార్చేశారు.నేను నా జీవితంలో వెనక్కి తిరిగి చూసుకుంటే నా లైఫ్ లో సుకుమారే వుంటారు. ఆయన నాకు అంతలా క్లోజ్ అయ్యారు.. గంగోత్రి సినిమా తర్వాత ఇంజిన్ లేని భోగిలా నేను వెళ్తున్నాను. ఆ సమయంలో ఆర్య సినిమాతో నన్నుసరైన ట్రాక్ లో పెట్టారు. ఇవాళ నేను మీ ముందు నిల్చుని మాట్లాడుతున్నానంటే దానికి కారణం సుకుమార్.ఆయనకీ నా జీవితాంతం రుణపడి ఉంటానని… లవ్ యు సుక్కు డార్లింగ్ అంటూ అల్లు అర్జున్ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

Exit mobile version