NTV Telugu Site icon

Pushpa 2 : రూ. 1000 కోట్ల క్లబ్ లో అల్లు అర్జున్.. ఇది కదా బ్రాండ్ అంటే.!

Pushpa2therule

Pushpa2therule

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘పుష్ప 2 : ది రూల్’. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీస్ నిర్మించింది. ఆంధ్రా నుండి అమెరికా వరకు ఎక్కడ చూసిన ఇప్పుడు ఒకటే మాట పుష్ప -2. హౌస్ ఫుల్ బోర్డ్స్ తో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా.

Also Read : Google : మోస్ట్ సెర్చెడ్ సినిమాల్లో సౌత్ సినిమాల హవా

అల్లు అర్జున్-సుకుమార్ కాంబో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఈ సినిమా రిలీజ్ అయిన కేవలం 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల కలెక్షన్‌ను దాటేసింది. దాంతో పాటు అత్యంత వేగంగా వెయ్యి కోట్ల మార్క్ ను అందుకున్న భారతీయ చిత్రంగా పుష్ప -2 నిలిచింది. కేవలం 6 రోజుల్లోనే ఇంతటి సెన్సేషన్ రికార్డును అందుకోవడం మాములు విషయం కాదని విశ్లేస్తున్నారు ట్రేడ్ పండితులు. టాలీవుడ్ లో వెయ్యి కోట్లు కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు బాహుబలి 2, RRR, కల్కి సినిమాల సరసన ఇప్పుడు పుష్ప -2 వచ్చి చేరింది. ఇక లాంగ్ రన్ లో ఏ సినిమా ఎంతటి సెన్సేషన్ చేస్తుందో అని అన్ని ఇండస్ట్రీలలో చర్చ నడుస్తోంది.ఇక హిందీలో అయితే పుష్ప -2 రికార్డ్స్ ను టచ్ చేయడం ఎవరివల్ల కాదని ట్రేడ్ అనలిస్ట్ ల అంచనా. థియేటర్ రన్ ముగిసే నాటికీ పుష్ప ఎంతటి సంచలం చేస్తుందో చూడాలి.

Show comments