Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప సిరీస్ చిత్రాలతో భారతీయ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ను, ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్పరాజ్‌గా ఆయన చూపించిన నటన, మేనరిజమ్, మేకోవర్ కు నార్త్ నుంచి సౌత్ వరకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ విజయాన్ని ముందే ఊహించినట్లుగా, అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలను మరింత భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు.
కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో ప్రకటించిన రాకా ప్రాజెక్ట్ సౌత్ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఆ చిత్రంలో బన్నీ లుక్ అండ్ గెటప్ చూసి చిత్ర పరిశ్రమ సైతం ఆశ్చర్యపోయింది.రాకాతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న AA23పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా కోసం బన్నీ గతంలో ఎన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారని సమాచారం. అయితే ఈ పాత్ర కోసం ఒక విభిన్నమైన మేకోవర్ సాధించేందుకు అల్లు అర్జున్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అభిమానులను, విమర్శకులను ఒక్కసారిగా ఆకట్టుకునేలా ఈ లుక్‌ను డిజైన్ చేయడానికి బన్నీ, లోకేష్ కలిసి చాలా సమయం కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read
- Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
- Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
- Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
- Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
ఆర్య నుంచి పుష్ప వరకు ఏ పాత్ర చేసినా తన వంద శాతం శ్రమను అందించడం ఐకాన్ స్టార్కే చెల్లింది. లోకేష్ సినిమా విషయంలోనూ ఆయన అదే డెడికేషన్ చూపిస్తున్నారు. ఇక డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గత చిత్రాలైన ‘ఖైదీ’, ‘విక్రమ్’ తరహాలోనే ‘AA23’లో కూడా రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ ఉండకపోవచ్చని టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కథలో ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉన్నప్పటికీ, అది రొటీన్, సంప్రదాయ హీరోయిన్ పాత్ర కాదని తెలుస్తోంది.
పుష్ప తెచ్చిపెట్టిన నేషనల్ స్టార్‌డమ్‌ను కేవలం నిలబెట్టుకోవడమే కాకుండా, సరిహద్దులను మరింత విస్తరించుకోవడానికి బన్నీ పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నారు. రాకా, AA23 ప్రాజెక్టులతో తన పాన్ ఇండియా మార్కెట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి బన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ఇండియన్ బాక్సాఫీస్‌పై మళ్లీ తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న ఐకాన్ స్టార్… AA23 కొత్త లుక్‌తో ఏ స్థాయిలో మెప్పిస్తారో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్
-
Harish Rao-KTR: “బతుకంతా తెలంగాణది”.. జయశంకర్ ఆశయాల స్మరించుకున్న బీఆర్ఎస్ నేతలు..
-
Trump Marine One: ట్రంప్‌కు గగనతలంలో ప్రమాదం?.. ప్రయాణిస్తున్న ‘మెరైన్ వన్’కు దగ్గరగా వచ్చిన ప్యాసింజర్ విమానం
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
CSK-IPL 2027: చెన్నై సూపర్ కింగ్స్‌కు మరో షాక్.. స్టార్ కోచ్ కూడా గుడ్‌బై.. సీఎస్కే భవిష్యత్‌పై బెంగ!
ట్రెండింగ్
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్‌తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!