Allu Arjun : సినిమా సినిమాకి కొత్త మేకోవర్‌తో వస్తోన్న అల్లు అర్జున్

Allu Arjun

Allu Arjun

పుష్ప సిరీస్‌ చిత్రాలతో భారతీయ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ను, ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్పరాజ్‌గా ఆయన చూపించిన నటన, మేనరిజమ్‌, మేకోవర్‌ కు నార్త్ నుంచి సౌత్ వరకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ విజయాన్ని ముందే ఊహించినట్లుగా, అల్లు అర్జున్ తన తదుపరి సినిమాలను మరింత భారీగా ప్లాన్ చేసుకుంటున్నారు.

కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీతో ప్రకటించిన రాకా ప్రాజెక్ట్ సౌత్‌ ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఆ చిత్రంలో బన్నీ లుక్ అండ్ గెటప్ చూసి చిత్ర పరిశ్రమ సైతం ఆశ్చర్యపోయింది.రాకాతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న AA23పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా కోసం బన్నీ గతంలో ఎన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారని సమాచారం. అయితే ఈ పాత్ర కోసం ఒక విభిన్నమైన మేకోవర్ సాధించేందుకు అల్లు అర్జున్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. అభిమానులను, విమర్శకులను ఒక్కసారిగా ఆకట్టుకునేలా ఈ లుక్‌ను డిజైన్ చేయడానికి బన్నీ, లోకేష్ కలిసి చాలా సమయం కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఆర్య నుంచి పుష్ప వరకు ఏ పాత్ర చేసినా తన వంద శాతం శ్రమను అందించడం ఐకాన్ స్టార్‌కే చెల్లింది. లోకేష్ సినిమా విషయంలోనూ ఆయన అదే డెడికేషన్ చూపిస్తున్నారు. ఇక డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గత చిత్రాలైన ‘ఖైదీ’, ‘విక్రమ్’ తరహాలోనే ‘AA23’లో కూడా రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ ఉండకపోవచ్చని టాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. కథలో ఒక పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉన్నప్పటికీ, అది రొటీన్, సంప్రదాయ హీరోయిన్ పాత్ర కాదని తెలుస్తోంది.

పుష్ప తెచ్చిపెట్టిన నేషనల్ స్టార్‌డమ్‌ను కేవలం నిలబెట్టుకోవడమే కాకుండా, సరిహద్దులను మరింత విస్తరించుకోవడానికి బన్నీ పక్కా ప్లానింగ్‌తో ముందుకు సాగుతున్నారు. రాకా, AA23 ప్రాజెక్టులతో తన పాన్ ఇండియా మార్కెట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి బన్నీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలతో ఇండియన్ బాక్సాఫీస్‌పై మళ్లీ తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్న ఐకాన్ స్టార్… AA23 కొత్త లుక్‌తో ఏ స్థాయిలో మెప్పిస్తారో వేచి చూడాలి.