Site icon NTV Telugu

Thandel Pre Release Event : తండేల్ రాజు కోసం రంగంలోకి పుష్ప రాజ్?

Thandel Pushpa Raj

Thandel Pushpa Raj

తండేల్ రాజు కోసం పుష్ప రాజు రంగంలోకి దిగుతున్నాడు. అవును మీరు విన్నది నిజమే. తండేల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ హాజరు కాబోతున్నాడు. నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా తండేల్ సినిమా రూపొందించారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాణంలో ఈ సినిమాని చందు మొండేటి డైరెక్ట్ చేశాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్ల బృందం గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్లి పాకిస్తాన్ నేవీ చేతికి చిక్కుతుంది. పాకిస్తాన్ నేవీ అరెస్ట్ చేసిన తర్వాత కొన్నాళ్ళు జైలు శిక్ష అనుభవించి తిరిగి ఆంధ్రప్రదేశ్ వస్తుంది.

Rashmika: స్టేజ్ మీద రష్మిక లైవ్ పెర్ఫార్మెన్స్

ఇలా నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకుని ఒక లవ్ స్టోరీ రూపొందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కేవలం తెలుగు కాదు పాన్ ఇండియా సినిమాగా తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ కానుంది. ప్రస్తుతానికి ప్రమోషన్స్ లో వేగం పెంచిన సినిమా యూనిట్ నిన్న చెన్నై వెళ్లి రాగా ఈరోజు ముంబైలో హిందీ ట్రైలర్ లాంచ్ చేస్తున్నారు. ఇక రేపు హైదరాబాద్ లో అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. వేదిక ఫిక్స్ కాలేదు వేదిక ఫిక్స్ అయిన తర్వాత సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version