ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. దక్షిణాదిన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోలలో అల్లు అర్జున్ ఒకరు. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా భారీగా అల్లు అర్జున్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అల్లు అర్జున్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 12 మిలియన్ల ఫాలోవర్స్ ను సొంతం చేసుకుని మరో మైలు రాయిని దాటారు. ఇటీవలే విజయ్ దేవరకొండ కూడా ఇన్‌స్టాలో 12 మిలియన్ల ఫాలోవర్లను దాటిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ దక్షిణాన ఎక్కువగా అనుసరించే తారలలో ఒకరు. బన్నీ అధికారిక ఫేస్‌బుక్ పేజీలో 2.1 కోట్ల మంది అనుచరులు ఉండగా, 5.9 మిలియన్ల అభిమానులు ట్విట్టర్‌లో ఆయనను అనుసరిస్తున్నారు. కాగా ఈ ఏడాది చివర్లో “పుష్ప” అనే పాన్ ఇండియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు బన్నీ. సుకుమార్ తెరకెక్కిస్తున్న’పుష్ప’ నుంచి బన్నీ పుట్టినరోజును పురస్కరించకుని ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ పేరుతో ఓ వీడియో విడుదల చేసింది యూనిట్. ఇప్పటికీ ఈ వీడియో ‘తెగ్గేదే లే’ అంటూ ఇంటర్నెట్ లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా… రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా సందడి చేయనున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప’కు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మరో మైల్ స్టోన్…!
