తండేల్ సినిమా గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ సినిమా ప్రారంభం కావడానికి అసలు సినిమాగా రూపాంతరం చెందడానికి ముఖ్య కారణం అల్లు అర్జున్ మీద ఒక పాకిస్తాన్ జైలు అధికారికి ఉన్న అభిమానం అని తెలిసింది. అసలు విషయం ఏమిటంటే శ్రీకాకుళం జిల్లాకి చెందిన కొంత మంది మత్స్యకారులు గుజరాత్ తీరానికి వెళ్లి అక్కడ పాకిస్తాన్ నేవీ చేతికి చిక్కి జైల్లో శిక్ష అనుభవించారు. అయితే ఆ జైలులో పనిచేస్తున్న ఒక వ్యక్తికి అల్లు అర్జున్ అంటే విపరీతమైన అభిమానమట. అల్లు అర్జున్ సొంత రాష్ట్రానికి చెందిన వారే అని తెలిసి వీరి పట్ల కూడా కాస్త సానుకూల దృక్పథంతో వ్యవహరించే వారట. అంతా క్లియర్ అయ్యి వెళ్ళిపోతున్న సమయంలో తనకు ఎలా అయినా అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ పంపించమని అడ్రస్ కూడా ఇచ్చారట.
Ram Gopal Varma: తగ్గేదేలే..! ఆర్జీవీ మరో వివాదాస్పద ట్వీట్..!
సొంత ఊరు తిరిగి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమలో పనిచేస్తున్న తమ ప్రాంతానికి చెందిన కార్తీక్ అనే యువకుడికి ఈ విషయం అంతా చెబితే ఆ కార్తీక్ అనే యువకుడు అల్లు అర్జున్ సంతకం కోసం గీతా ఆర్ట్స్ కి టచ్లోకి వెళ్లారట. విషయం బన్నీ వాసుకు తెలియడంతో అసలు ఇదే ఒక కథగా చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన మొదలై కార్తీక్ ని పూర్తి కథ సిద్ధం చేయమని అడిగారట. అలా కథ సిద్ధం చేసిన తర్వాత చందు మొండేటి ప్రాజెక్టులోకి ఎంటర్ కావడం, ప్రాజెక్టు పట్టాలెక్కడం జరిగిపోయాయి మొత్తం. మీద అల్లు అర్జున్ మీద ఉన్న అభిమానం ఒక సినిమాకి కారణమైంది అనేది మాత్రం ఒక ఆసక్తికర అంశం అని చెప్పక తప్పదు.