యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. ఈ రోజు ‘తండేల్’ జాతర ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.
కాగా ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్ వస్తాడని మేకర్స్ ముందుగానే ప్రకటించారు మేకర్స్. సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ హాజరుకానున్న మొదటి ఈవెంట్ కావడంతో ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూసారు. కానీ చివరి నిమిషంలో తండేల్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు డుమ్మా కొట్టాడు. అయితే బన్నీ రాకపోవడానికి గల కారణాలను అల్లు అరవింద్ వివరించారు. ఆయన మాట్లాడుతూ ‘అల్లు అర్జున్ ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చాడు అయితే తీవ్రమైన గ్యాస్ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నాడు, ఆ కారణంగానే బన్నీ ఈ కార్యక్రమానికి రాలేదు. తన మాటగా బన్నీ చెప్పమన్నాడని అల్లు అరవింద్ తెలిపారు. అయితే బన్నీరాలేడని తెలిసి సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ను విశిష్ట అతిథిగాపిలిచారని మరోవైపు నుండి సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.