NTV Telugu Site icon

Allu Arjun: మహేష్ బాబు అందం.. అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

Allu Arjun Mahesh

Allu Arjun Mahesh

అల్లు అర్జున్, మహేష్ బాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే త్వరలో పుష్ప టు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే అనే కార్యక్రమానికి అల్లు అర్జున్ హాజరయ్యారు. నిజానికి ఈ షూటింగ్ కొద్ది రోజుల క్రితమే పూర్తయింది. ఎట్టకేలకు నిన్న అర్ధరాత్రి 12 గంటల నుంచి ఈ షో కి సంబంధించిన తాజా ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్లో అనేక విషయాలను అల్లు అర్జున్ నందమూరి బాలకృష్ణ తో షేర్ చేసుకున్నారు. నందమూరి బాలకృష్ణ అడిగిన అనేక ప్రశ్నలకు ఎంతో ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. అల్లు అర్జున్ ఈ సందర్భంలోనే మహేష్ బాబు గురించి అల్లు అర్జున్ ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఒక్కొక్క ఫోటో ప్లే చేస్తూ ఆ సెలబ్రిటీ గురించి చెప్పాలని నందమూరి బాలకృష్ణ కోరారు.

Allu Arjun: అల్లు అర్జున్ కి పోటీ ప్రభాసా? మహేషా? అంత మాట అనేశాడు ఏంటి?

అలా మహేష్ బాబు ఫోటో కూడా ప్లే చేయగా అల్లు అర్జున్ మాట్లాడుతూ మహేష్ బాబు గారు అనగానే అందరూ ఆయన అందం గురించి కానీ దీని గురించి గానీ మాట్లాడతారు అది ఎలాగూ ఉండనే ఉంది. కానీ అది కాకుండా నాకు పర్సనల్గా ఆయనలో బాగా నచ్చే విషయం ఏమిటంటే ఆయన కంబాక్స్ చాలా బాగుంటాయి. ఆయన ఫెయిల్యూర్ తర్వాత ఆయన ఇచ్చే కం బాక్స్ చాలా బాగుంటాయి. నాకు అది బాగా అడ్మయిరింగ్ విషయం. నాకు అది చాలా ఇష్టం ఆయనలో అలాగే ఆయన ఒక నిజమైన సినిమా ప్రేమికుడు. జన్యూన్ గా తెలుగు సినిమాల్లో ఆయన తరపు నుంచి తెలుగు సినిమా అని ఒక స్టాండర్డ్ పెంచిన నటుడు. అందుకే ఆయనంటే నాకు చాలా రెస్పెక్ట్ అంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియోని అటు మహేష్ అభిమానులతో పాటు అల్లు అర్జున్ అభిమానులు సైతం వైరల్ చేస్తున్నారు.

Show comments