NTV Telugu Site icon

Allu Arjun: మాట మార్చిన అల్లు అర్జున్.. ఇలా దొరికేశాడు ఏంటి?

Allu Arjun

Allu Arjun

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సెకండ్ పార్ట్ డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 17వ తేదీ నుంచి సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున ప్రారంభించబోతోంది సినిమా యూనిట్. అయితే ఈ ప్రమోషన్స్ ప్రారంభించక ముందే నందమూరి బాలకృష్ణ పోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ లో ఒక ఎపిసోడ్ చేశారు. అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ త్వరలో టెలికాస్ట్ కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమోలో నేషనల్ అవార్డు గురించి అల్లు అర్జున్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ అవార్డు వచ్చినప్పుడు ఎలా అనిపించింది అని అడిగితే బెస్ట్ యాక్టర్ క్యాటగిరీలో తెలుగువారికి నేషనల్ అవార్డు ఎప్పుడు వచ్చింది అని చెక్ చేస్తే ఒక్క తెలుగువారి పేరు కూడా కనిపించలేదు. అది నా మనసులో అలాగే ఉండిపోయింది అందుకే నేషనల్ అవార్డు అని రౌండప్ చేసి దీన్ని కొట్టాలి అని ఫిక్స్ అయ్యానని అల్లు అర్జున్ గుర్తు చేసుకున్నాడు.

Mulugu: ములుగు జిల్లాలోని ఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణ.. కారణం ఇదే..

ఈ ప్రోమో సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. అదే సమయంలో నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అల్లు అర్జున్ స్పందించిన ఒక న్యూస్ క్లిప్పింగ్ కూడా వైరల్ అవుతుంది. ఆ సమయంలో ఆయన ఉత్తమ జాతీయ నటుడుగా తొలి పురస్కారం సాధించానని తెలిసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో అంతే షాక్కు గురయ్యాను. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే అవార్డు వచ్చిందేమో అనుకున్నా, నేను మూడో వాడిన నాలుగో వాడ్ని అనుకున్న. కానీ టీవీలో అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిశాక ఆశ్చర్యపోయానని అన్నారు. అంటే నేను ఏదో మిగతా వాళ్ళ కంటే గొప్ప అని కాదు కానీ గొప్ప గొప్ప నటులకు ఉన్న ఎందుకో కుదరలేదని అంటూ ఆయన ఈ అవార్డు అందుకున్న తర్వాత పలు ఇంటర్వ్యూలలో ఈ విషయాన్ని పంచుకున్నారు. దీంతో అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు అంటూ అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

Show comments