NTV Telugu Site icon

Allu Arjun: ఆరేళ్ళ తరువాత లుక్ మార్చిన అల్లు అర్జున్?

Allu Arjun New Look

Allu Arjun New Look

అల్లు అర్జున్ పుష్ప సినిమా మొదలు పెట్టి దాదాపు నాలుగేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఆయన జులపాలతో పాటు గడ్డం కూడా పెంచుకున్నారు. పుష్ప రాజ్ పాత్ర కోసం ఆయన అప్పటి నుంచి అదే జుట్టు అదే గడ్డం మైంటైన్ చేస్తూ వచ్చాడు. అయితే ఎట్టకేలకు పుష్ప 2 సినిమా గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకుంది కూడా. ఇక దీంతో ఆయన తన జుట్టు కత్తిరించుకోవడంతో పాటు గడ్డం కూడా ట్రిమ్మింగ్ చేయించారు. ఈరోజు అల్లు అర్జున్ బయటకు రాగా ఆయన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌ లోని నాంపల్లి సిటీ సెషన్స్ కోర్టుకు వెళ్లారు అల్లు అర్జున్. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిన్న అల్లు అర్జున్‌కు బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు.

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి లేటెస్ట్ పోస్టర్ వచ్చింది చూశారా?

అయితే అది పూచీకత్తు మీద ఇచ్చిన బెయిల్ కావడంతో ఈరోజు ఆ రెగ్యులర్‌ బెయిల్‌కు సంబంధించి పర్సనల్‌ బాండ్స్‌, రెండు ష్యూరిటీలు సమర్పించారు అల్లు అర్జున్.. ఇక అల్లు అర్జున్‌ పర్సనల్‌ మేనేజర్ కూడా మరో షూరిటీ కోర్టుకు సమర్పించారని తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఈ నెల 4వ తేదీ రాత్రి పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. బాలుడు తీవ్రంగా గాయపడి హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Show comments