Site icon NTV Telugu

AA 22 : అల్లు అర్జున్..అట్లీ.. పాన్ వరల్డ్ సినిమా.!

Aa22

Aa22

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన పుష్ప2 సినిమా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు తిరుగులేని విజయాన్ని అందించింది. అంతేకాదు హిందీలో బన్నీకి భారీ క్రేజ్ తెచ్చిపెట్టింది. దీంతో పాన్ ఇండియా లెవల్లో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఈ నేపధ్యంలో త్రివిక్రమ్, సంజయ్ లీల భన్సాలీ, అట్లీ పేర్లు పించాయి వినిపించాయి. అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌ లో సినిమాను నేడు అధికారంగా ప్రకటించారు.

కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ లో ఒకటైన సన్ పిచర్స్  అల్లు అర్జున్, అట్లీ సినిమాను నిర్మిస్తోంది. అందుకు సంబంధించి కాసేపటి క్రితం వీడియో రిలీజ్ చేసారు మేకర్స్. అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు అట్లీ ఈ సినిమా కోసం అమెరికా పయనమయ్యారు. హాలీవుడ్ సినిమాలైన స్పైడర్ మ్యాన్, అవతార్, వాళ్వరిన్, టెర్మినేటర్ వంటి సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించిన ప్రముఖ VFX స్టూడియోస్, మోషన్ స్టూడియోస్ టెక్నిషియన్స్ ను కలిసి బన్నీ లుక్ టెస్ట్ నిర్వహించారు. ఆ విజువల్స్, థీమ్ చూస్తుంటే ఇదేదో హాలీవుడ్ సినిమాను ధీటుగా ఉంది. అందరూ అనుకున్నట్టుగా బన్నీ ఈ సారి పాన్ ఇండియా సినిమా కాదు ఏకంగా పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడని అనిపిస్తోంది. బన్నీ కెరీర్ లో 22, అట్లీ కెరీర్ లో 6వ సినిమాగా వస్తున్న ఈ పాన్ వరల్డ్ ప్రొజెక్ట్ కు సంబంధించి ఇతర వివరాలు త్వరలో తెలియజేయనున్నారు. మొత్తానికి అల్లు అర్జున్, అట్లీ అనౌన్స్ మెంట్ వీడియోతోనే సెన్సేషన్ కు తెరలేపారనే చెప్పాలి.

Exit mobile version