Site icon NTV Telugu

Allu Arjun : అల్లు అర్జున్- అట్లీ సినిమాలో మరో హీరో ?

Allu Arjun Atlee

Allu Arjun Atlee

ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు హీరోలు తీసుకొస్తున్న సినిమాలు చూస్తుంటే ఒకొక్కరికి మతి పోతున్నాయి. లార్జర్ థన్ లైఫ్ సినిమాలు అలాగే హాలీవుడ్ లెవెల్ యాక్షన్ హంగులు ఉన్న భారీ సెట్టింగ్స్, ఇలా ఎన్నెన్నో సినిమాలు ఇండియన్ సినిమా దగ్గర నుంచి వస్తున్నాయి. ఇక అలా ఇండియన్ సినిమా నుంచి రీసెంట్‌గా ఇంటర్నేషనల్ లెవెల్లో అనౌన్స్ అయిన సినిమా ఏదైనా ఉంది అంటే.. అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ అని చెప్పవచ్చు. కాగా ఈ చిత్రం అనౌన్స్ చేసినపుడే అందులో విజువల్స్ చూసి హాలీవుడ్ లెవల్లో ప్లాన్ చేస్తున్నట్టు అర్ధం అవుతుంది.

Also Read: Meenakshi : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరోయిన్!

అయితే ఈ మూవీలో బన్ని మొత్తం మూడు పాత్రలు పోషించననున్నాడ. ఇందుకోసం చాలా కసరత్తులు చేస్తున్నాడట. ఇక ఈ సినిమాతో విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఆడియెన్స్‌ని ఖచ్చితంగా మరో లోకం లోకి తీసుకెళ్ళడానికి బన్నీ ఇంకా అట్లీ ఇద్దరు గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ రెంజ్ మూవీ కోసం యాక్టర్స్‌ని ఎంచుకోవడం ఒక్కింత కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పాత్ర చాలా ముఖ్యం. అందుకే ఇప్పటిక వరకు ఈ మూవీ‌లో నటనటుల గురించి ఎలాంటి అప్ డేట్‌లు రావడంలేదు. కానీ తాజాగా ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్‌ను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రలో ఓ బాలీవుడ్ హీరోని తీసుకునే ఆలోచనలో మూవీ టీం ఉన్నట్లు సమాచారం. మరి ఆ హీరో ఎవరు అనేది చూడాలి. ప్రజంట్ టాలీవుడ్ బారీ చిత్రాల్లో ఒక్కరైనా బాలీవుడ్ యాక్టర్స్ కచ్చితంగా ఉంటున్నారు. మరి ఈ మూవీలో ఎవరు రాబోతున్నారు చూడాలి.

Exit mobile version