ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కూతురుతో కలిసి దిగిన క్యూట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో అల్లు అర్హ తన తండ్రి బన్నీ ఛాతీపై నిలబడి ఉంది. తండ్రీకూతుళ్ళు ఇద్దరూ ఒకే పోజ్ లో ఉన్నారు ఈ పిక్ లో. ఈ పిక్ ను అల్లు అర్జున భార్య స్నేహారెడ్డి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ ఫోటోలో అర్హా ముదురు నీలం రంగు నైట్‌సూట్ ధరించగా… అల్లు అర్జున్ తెలుపు బనియన్, షార్ట్ ధరించాడు. ఈ పిక్ స్నేహ షేర్ చేసిన 3 గంటల్లోనే 4,34,504 వ్యూస్, 1,54,410 లైక్స్ రావడం విశేషం. ఇక ఈ పిక్ చూసిన బన్నీ అభిమానులు “తండ్రి ప్రేమ అత్యంత విలువైనది” అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే… ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎర్ర గంధపు చెక్క స్మగ్లర్ల జీవితాల ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా, ఫహద్ ఫాసిల్ విలన్ గా నటించారు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన పుష్ప రాజ్ టీజర్ ఆల్ టైం రికార్డును సెట్ చేసి అల్లు అర్జున్ క్రేజ్ ను నిరూపించింది.
కూతురుతో అల్లు అర్జున్… క్యూట్ పిక్ వైరల్
