NTV Telugu Site icon

Allu Arjun: బన్నీ భారీ ప్రాజెక్ట్.. ఊహించని కాంబో లోడింగ్? (అల్లు అర్జున్)

Bany

Bany

‘పుష్ప 2’ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఏకంగా రూ.1900 కోట్ల వరకు వసూలు చేసి.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇంకా ఈ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్‌లో పుష్పగాడి హవా మామూలుగా లేదు. దీంతో.. బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే త్రివిక్రమ్‌తో సినిమా అనౌన్స్ చేశాడు అల్లు అర్జున్. మైథలాజికల్ బ్యాక్ డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని, నిర్మాత నాగవంశీ చెబుతున్నాడు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

మరి ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అంటే, భారీగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈసారి బాలీవుడ్‌లో గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టుగా చెబుతున్నారు. వాస్తవానికి గతంలోనే బన్నీ బాలీవుడ్ సినిమా చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి అదే న్యూస్ వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ ముంబై వెళ్లి దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీని కలవడం హాట్ టాపిక్ అయింది. దీంతో.. ఈ కాంబో దాదాపుగా మూవీ ఫిక్స్ అయినట్టుగా రూమర్స్ వైరల్ అవుతున్నాయి. భన్సాలీ సినిమా అంటే.. ఆ భారీతనం, ఆ కథ, కథనం వేరేలా ఉంటుంది. ప్రస్తుతం ఆయన ‘లవ్ అండ్ వార్’ సినిమా రూపొందిస్తున్నారు. రన్బీర్ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. 2026లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత భన్సాలీ చేయబోయేది బన్నీ ప్రాజెక్ట్ అని బాలీవుడ్ వర్గాల సమాచారం.

Show comments