NTV Telugu Site icon

Allu Aravind: మీ బామ్మర్దితో సినిమా చేస్తున్నామని ఎన్టీఆర్ కి ఫోన్.. షాకింగ్ సమాధానం!

Allu Aravind

Allu Aravind

Allu Aravind Speech At AAY Theme Song Launch Event : ప్రతిష్టాత్మక సంస్థ GA2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ ఫన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. డిఫ‌రెంట్ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో ఈ సినిమా అందరి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ‘ఆయ్’ సినిమా నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. సోష‌ల్ మీడియాలో రీల్స్‌, షార్ట్స్ రూపంలో తెగ వైర‌ల్ అయ్యాయి. దీంతో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఆయ్ సినిమాను స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా అదే రోజు ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈరోజు ఈ సినిమా నుంచి సాంగ్ ఒకదాన్ని లాంఛ్ చేస్తూ సినిమా యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.

Atlee: అనంత్ అంబానీ పెళ్లిలో సైలెంటుగా ఆ పని కానిచ్చేసిన అట్లీ!

ఈ క్రమంలో అల్లు అర్జున్ ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టారు. ఆయన మాట్లాడుతూ పెద్ద కుటుంబం నుంచి ఒక మనిషిని హీరోగా పెట్టుకుంటున్నాం కదా అని ఎన్టీఆర్ గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇలా నితిన్ ని హీరోగా అనుకుంటున్నాం అంటే ఏమండీ ఎవరి లైఫ్ వాళ్ళది. మన బంధువులం అని ఏదో ఒక సినిమాకి రెండు సినిమాలకి ఫస్ట్ డే వరకు చెప్పుకొని తీసుకుని వెళ్తాం ఆ తర్వాత వాళ్లు పడే కష్టం వాళ్ళు చేసే యాక్టింగ్ దాన్నిబట్టే వాళ్ళు పైకి వెళ్తారు. అందుకే మీ కథ బాగుందని చెప్పాడు కనుక చేసేయడమే. ఇవన్నీ పెద్దగా ఆలోచించవద్దు. పెద్దల కుటుంబం నుంచి వస్తున్నాడు, ఇలాంటి క్యారెక్టర్ చేయగలడా లేదా అని అనుమానాలు వద్దు సినిమా చేసేయండి బ్రహ్మాండంగా ఆడుతుంది. మీరు డెఫినెట్గా మిస్ కానివ్వద్దు చేయండి అని అన్నారు. సో నితిన్ లో ఆ మెరిట్ చాలా బాగా ఉంది చాలా ఈజ్ తో చేశాడు. అమ్మాయి కూడా బాగా చేసింది ఆ అమ్మాయి వేరే షూటింగ్లో ఉంది. అంటూ ఎన్టీఆర్ చెప్పిన మాటలను అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

Show comments