తల్లి మరణం మరువకముందే అల్లు అరవింద్‌ను మరో విషాదం వెంటాడింది. ఆయన సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడైన సి. నాగరాజు అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. చిన్ననాటి నుంచి అల్లు అరవింద్ స్నేహితుడైన నాగరాజు, అల్లు అరవింద్‌తో కలిసి ఉండాలని హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యారు. గీతా ఆర్ట్స్ నిర్మించిన ‘మాస్టర్’ సినిమా నుంచి ఆయన గీతా ఆర్ట్స్ నిర్మించిన ఎన్నో సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.
Also Read : Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 లైవ్ అప్డేట్స్
ప్రస్తుతం నాగరాజు వయసు 76 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఆస్ట్రేలియాలో సెటిలైన కుమారుడు ఈ రోజు ఉదయాన్నే హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరిగాయి. ఆయన అంత్యక్రియల కార్యక్రమాన్ని మొత్తం అల్లు అరవింద్ స్వయంగా దగ్గరుండి చూసుకున్నారు. అలాగే, దర్శకుడు రవిరాజా పినిశెట్టి కూడా నాగరాజుకు మంచి స్నేహితుడు. అల్లు అరవింద్, రవిరాజా పినిశెట్టి, ఏడిద నాగేశ్వరరావు కుమారులు, బన్నీ వాసు, వంశీ నందిపాటి, బండ్ల గణేష్, సురేష్ కొండేటి హాజరయి సంతాపం వ్యక్తం చేశారు
