ప్రేమ గురించి సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా దివానా అనే సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి అతిథిగా హాజరైన అల్లు అరవింద్ ప్రేమ గురించి ఈ మేరకు కామెంట్లు చేశారు. ఇదే కార్యక్రమానికి హాజరైన హీరో విశ్వక్సేన్ చెప్పండి సార్, మీ ఫస్ట్ వన్ సైడ్ లవ్ స్టోరీ చెప్పండి సార్. ఈరోజు అందరం, ఈరోజు మీ లవ్ స్టోరీ విందాం అంటే దానికి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఒకటా? రెండా? అని అడుగగా రెండోది, ఇప్పటికీ స్విచ్ ఆన్ ఉందా సార్? అని విశ్వక్ ప్రశ్నించాడు. వన్ సైడ్ అన్న తర్వాత ఎన్నన్నా ఉంటాయి అని అరవింద్ అన్నారు.
ఇప్పుడు, ఇప్పుడు, ఇప్పుడు ఒకటేనా సార్? అంటే ఇప్పుడు ఒకటే,నా వయసుని బట్టి అడుగుతున్నావ్ అని తన ఏజ్ తగ్గించుకునే ప్రయత్నం చేశారు. కదా సార్, మనం, మనం యూత్ అని విశ్వక్ అనగా దానికి అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇవాళ ఏముందయ్యా? ఇవాళ లవ్ బిగిన్ అవుద్ది, జనం లేని సినిమాలకి వెళ్లి, అంటే ఎక్కువ హిట్ కాని సినిమాలకి వెళ్ళి కార్నర్ సీట్లో కూర్చొని, ఆ తర్వాత రెండు షాపింగ్లకి వెళ్లి, ఇవాళ లవ్ ఓయోలో ఎండ్ అవుతుంది అని అన్నారు. దానికి విశ్వక్ తనకు Oyo రూమ్ అంటే ఏంటో తెలియదు అన్నట్టు బిహేవ్ చేసే ప్రయత్నం చేశారు.

