NTV Telugu Site icon

Manchu Manoj: మనోజ్ కోసం మోహన్ బాబు నివాసానికి ఆళ్లగడ్డ బ్యాచ్?

Manchu Manj

Manchu Manj

సినీ నటుడు మోహన్ బాబు ఇంటి వ్యవహారం రచ్చకెక్కింది. ఆస్తుల పంపకాల వ్యవహారంలో మంచు మనోజ్, మోహన్ బాబు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇక మా మధ్య ఏమీ లేదని, ఈ వార్తలు అవాస్తమని మీడియాకి లీకులు ఇస్తున్నా సరే జల్ పల్లి మోహన్ బాబు నివాసం వద్ద హైడ్రామా కొనసాగుతోంది. మరికాసేపట్లో జల్ పల్లి నివాసానికి మంచు విష్ణు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. అమెరికా వెళ్ళిన మంచు విష్ణు అక్కడి నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తోంది. మంచు విష్ణు రానుండటంతో జల్ పల్లి నివాసం వద్ద బౌన్సర్లను మోహరించారు. జల్‌పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద బౌన్సర్లను మోహరించారు విష్ణు, మనోజ్. విదేశాల్లో ఉన్న విష్ణు తన వ్యాపార భాగస్వామి ద్వారా సీసీ ఫుటేజీ మొత్తం స్వాధీనం చేసుకుని 40 మంది బౌన్సర్లను కాపలా పెట్టారు. మనోజ్ కూడా 30 మందిని తెప్పించుకున్నారు.

Mohan Babu: మీడియా సిబ్బందిపై మోహన్‌బాబు సెక్యూరిటీ దాడి

మరో పక్క మనోజ్ భార్య సొంత ప్రాంతమైన ఆళ్లగడ్డ నుండి మంచు మనోజ్ కు మద్దతుగా మరికొందరు వచ్చినట్టు చెబుతున్నారు. మంచు విష్ణు వస్తుండడంతో జలపల్లి మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొనగా మోహన్ బాబు నివాసం వద్ద లేడీ బౌన్సర్లు కూడా రంగంలోకి దిగారు. మంచు ఫ్యామిలీలో వివాదానికి కేంద్ర బిందువుగా వినయ్ అనే వ్యక్తి మారారు. ఎంబియూ, విద్యానికేతన్ విద్యా సంస్థల్లో కీలకంగా ఉన్న వినయ్ కారణంగానే ఈ వివాదం ఏర్పడినట్టుగా చెబుతున్నారు. ఇక మరోపక్క మోహన్ బాబు నివాసానికి వచ్చి కాసేపటి తరువాత మంచు లక్ష్మి వెళ్లిపోయారు. అయితే మంచు విష్ణు ఇక్కడ లేరని అమెరికాలోనే ఉన్నారని ఆయన పీఆర్ టీం వెల్లడించింది.