NTV Telugu Site icon

Alia Bhat: టాలీవుడ్ పై అలియా భట్ ఫోకస్?

Alia Bhatt, Kiara Advani

Alia Bhatt, Kiara Advani

బాలీవుడ్ ముద్దుగుమ్మలంతా ఒక్కొక్కరుగా టాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే కియారా మూడు చిత్రాలతో ఆకట్టుకుంటే.. దీపిక ఒక్క సినిమాతోనే అదరగొట్టేసింది. మొన్న వచ్చిన జాన్వీ కూడా క్రేజీ ప్రాజెక్టులను ఒడిసిపట్టేస్తోంది. మరీ నెనెందుకు లేట్ చేయాలనుకుంటున్న భామ.. నెక్ట్స్ ప్రాజెక్ట్ సెట్ చేసుకునే పనిలో ఉంది.. ఆమె ఇంకెవరో కాదు ఆర్ఆర్ఆర్ తో టాలీవుడ్ ఆడియన్స్ ని ఫిదా చేసిన బ్యూటీ ఆలియా భట్.. దీని తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు.. ఒప్పుకోలేదు. దేవరలో చేస్తుందని ఓసారి.. ఇదిగో మరో మూవీలో అంటూ మరోసారి వినబడ్డాయి కానీ.. ఆమె మాత్రం ఏ సినిమాకు కమిట్ కాలేదు. కానీ ఆమె వెనుక ముందు.. వచ్చిన భామలు కియారా అద్వానీ.. త్రీ మూవీస్ తో టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గరై కూర్చొంది. ప్రభాస్ కల్కితో దీపికా పదుకొనే కూడా టాలీవుడ్ లో జెండా పాతింది. ఆమె వెనుక వచ్చిన జూనియర్ జాన్వీ కపూర్ కూడా దేవరతో తెలుగు ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది.

Krithi Sanon: నార్తులో గోల్డు.. సౌత్ లో ఐరన్.. పాపం కృతి!

హాలీవుడ్ చెక్కేసిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కూడా టాలీవుడ్ వైపు చూస్తుంటే.. నేనేందుకు మీనమేషాలు లెక్కెట్టం అని భావించిన అలియా తెలుగుపై ఫోకస్ చేసేందుకు రెడీ అవుతొందని టాక్. ప్రెజెంట్ అమ్మడి చేతిలో క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్టులున్నాయి. యష్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కిస్తోన్న హై బడ్జెట్ మూవీ ఆల్ఫాలో నటిస్తోంది. ఆల్ఫా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రిస్మస్ బరిలో నిలవనుంది. ఇప్పటికే ఫీమేల్ ఓరియెంట్ చిత్రం జిగ్రాతో పొగొట్టుకున్న ఇమేజ్ మళ్లీ తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న లవ్ అండ్ వార్ లో కనిపించబోతోంది అమ్మడు. ఇందులో హస్బెండ్ రణబీర్ కపూర్.. విక్కీ కౌశల్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులను సరిపోలేదని ఇప్పుడు తెలుగు దర్శకుడితో చర్చలు మొదలుపెట్టిందట. కల్కితో బాలీవుడ్ చూపు తన వైపు తిప్పుకున్న నాగ్ అశ్విన్ తో సినిమాను లైన్లో పెడుతోందని టాక్. కల్కి పార్ట్ 2 తీయడానికి ముందు అశ్విన్.. అలియాతో సినిమా చేయబోతున్నాడని ఎప్పటి నుండో టాక్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ రూమర్ మరింత ఊపందుకుంది. అలియా, అశ్విన్ మధ్య చర్చలు జరిగాయని, మేటర్ లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం.