Site icon NTV Telugu

Alia Bhatt : అలియా భట్‌కి రూ.76 లక్షల మోసం – మాజీ పీఏ వేదిక శెట్టి అరెస్ట్!

Alia Bhatt

Alia Bhatt

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, తన పర్సనల్ అసిస్టెంట్ చేతిలో రూ.77 లక్షల మోసానికి గురైన ఘటన ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఆలియాకు పర్సనల్ అసిస్టెంట్‌గా పని చేసిన వేదికా ప్రకాశ్ శెట్టిపై ముంబైలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది.‌ 2021 నుంచి 2024 వరకూ ఆలియా వ్యక్తిగత సహాయకురాలిగా వేదిక పని చేసింది. నటికి సంబంధించిన ఫైనాన్షియల్ డాక్యుమెంట్లు, పేమెంట్స్, షెడ్యూల్ ప్లానింగ్లను చూసుకునేది. ఉద్యోగంలో చేరిన ఏడాది తర్వాత నుంచే నకిలీ బిల్లులు సృష్టించి అలియా సంతకాన్ని మార్ఫింగ్ చేసి ఈ మోసానికి పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నటి తల్లి,  దర్శకురాలు సోనీ, రజ్జాన్ ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు కింద వేదికను అరెస్ట్ చేశారు.

Also Read :Raju Gaani Saval : జగపతిబాబు చేతుల మీదుగా ‘రాజు గాని సవాల్’ మూవీ టీజర్ లాంఛ్..

నకిలీ బిల్లులు తయారుచేసి ఆలియాతో సంతకాలు చేయించి డబ్బును స్వాహా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అలియా సంతకం చేసిన తర్వాత వేదిక ఈ మొత్తాన్ని తన స్నేహితుల అకౌంట్ కు పంపి తర్వాత వినియోగించేదని పోలీసులు తెలిపారు. తనపై కేసు నమోదైన తర్వాత వేదిక పరారైంది. రాజస్థాన్, కర్ణాటక, పూణెల్లో తిరిగింది. చివరకు బెంగళూరులో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ముంబయికి తీసుకువచ్చారు. ఇక బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన ఆలియా భట్ కి అత్యంత నమ్మకమైన వ్యక్తి చేతిలో అంత పెద్ద మోసం జరగడం సినీ పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది సెలబ్రిటీలకు సంబంధించిన ప్రైవేట్ జీవితాల్లో, ఫైనాన్షియల్ స్కాంలు ఎలా జరిగే అవకాశం ఉందనే విషయం మరోసారి స్పష్టం అయింది. మరి ఈ కేసులో ఇంకెన్ని షాకింగ్ విషయాలు బయటపడతాయో చూడాలి.

Exit mobile version